Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అంగరంగ వైభవంగా పీవీ సింధు పెళ్లి!

భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పూసర్ల వెంకట సింధు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. పోసిడెక్స్‌ టెక్నాలజీస్‌ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వెంకట దత్త సాయితో సింధు వివాహాం ఆదివారం ఘనంగా జరిగింది. రాజస్థాన్‌, ఉదయ్‌పూర్‌లోని ఓ దీవిలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య రాత్రి 11.20 గంటలకు మూడు ముళ్ల బంధంతో సాయి-సింధు ఒక్కటయ్యారు. ఉదయ్ సాగర్ సరస్సులో ఉన్న రఫల్స్ హోటల్ ఈ వేడుకకు వేదికగా నిలిచింది.

తెలుగు సంప్రదాయాలకు అనుగుణంగా పూర్తి శాస్త్రబద్ధంగా ఈ పెళ్లిని నిర్వహించారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిపి మొత్తం 140 మంది ముఖ్యుల సమక్షంలో ఈ వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లిలో తెలుగుదనంతో పాటు రాజస్థాన్‌ రాచరిక సంస్కృతి ఉట్టిపడేలా ఏర్పాట్లు చేశారు.

PV Sindhu married fiance Venkata Datta Sai in Udaipur

ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సభ్యుడు చాముండేశ్వర్‌నాథ్‌, వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌తో పాటు ప్రముఖ వైద్యుడు గురువారెడ్డి తదితరులు ఈ వివాహానికి హాజరయ్యారు. మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో వివాహ రిసెప్షన్‌ జరగనుంది. ఈ రిసెప్షన్‌కు సినీ, రాజకీ, క్రీడా ప్రముఖులు హాజరవ్వనున్నారు.

ఆరావళి పర్వతాల మధ్య ఉదయ్‌సాగర్‌ సరస్సులో 21 ఎకరాల్లో ఈ దీవి విస్తరించి ఉండగా.. రఫల్స్‌ సంస్థ రాజభవనాలను తలపించే రిసార్ట్‌ను నిర్మించింది. ఈ రిసార్ట్‌లో 100 గదులతో మూడు ప్రధాన భవంతులు ఉన్నాయి. ఈ రిసార్ట్‌లో సాధారణ గదికి ఒక్క రోజు రెంట్ సుమారు లక్ష రూపాయలు. సింధు పెళ్లి నిమిత్తం అతిథుల కోసం ఈ 100 గదులను బుక్‌ చేశారు. ఈ పెళ్లికి వచ్చిన వారికి సింధు కుటుంబం విమాన టికెట్లు కూడా బుక్ చేసింది.

Story first published: Monday, December 23, 2024, 10:28 [IST]
Other articles published on Dec 23, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+