Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వరల్డ్ ఛాంపియన్ పీవీ సింధుకి రామినేని ఫౌండేషన్ అవార్డు

PV Sindhu
Photo Credit:


హైదరాబాద్:
డాక్టర్‌ రామినేని ఫౌండేషన్‌ 20వ వార్షికోత్సవం నగరంలోని నెక్లెస్‌రోడ్‌లో ఉన్న జలవిహార్‌లో ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్యమంలో వివిధ రంగాల్లో సేవలందించిన పలువురికి 2019 సంవత్సరానికి గాను డాక్టర్‌ రామినేని పురస్కారాలను ప్రదానం చేశారు.

ఇందులో భాగంగా ప్రపంచ ఛాంపియన్ పీవీ సింధు (విశిష్ట పురస్కారం) అందజేశారు. మరోవైపు సంకురాత్రి ఫౌండేషన్‌ వ్యవస్థాఫకుడు డాక్టర్‌ చంద్రశేఖర్‌, కూచిపూడి కళాకేంద్రం వ్యవస్థాపకుడు కళారత్న బాల కొండల రావు, ప్రజాకవి గోరెటి వెంకన్నలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పురస్కారాలను అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ తండ్రి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ ఆయన స్థాపించిన ఫౌండేషన్‌ ద్వారా పలు సేవా కార్యక్రమాలతోపాటు వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారికి పురస్కారాలను ప్రదానం చేయడం అభినందనీయమని కొనియాడారు.

ఇక, రామినేని ఫౌండేషన్‌ చైర్మన్‌ ధర్మప్రచారక్‌ రామినేని, కన్వీనర్‌ గుంటూరు జడ్పీ మాజీ చైర్మన్‌ పాతూరి నాగభూషణం మాట్లాడుతూ వివిధ రంగాల్లో విశిష్ట, విశేష సేవలందిస్తున్న ప్రముఖులకు గత 19 సంవత్సరాలుగా రామినేని పురస్కారాలను అందచేస్తున్నామని తెలిపారు.

పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఎల్వీ ప్రసాద్‌ వ్యవస్థాపక డైరెక్టర్‌ డాక్టర్‌ జీఎన్‌ రావు, సీనియర్‌ సంపాదకులు రామచంద్రమూర్తి, ప్రముఖ హిప్నాటిస్ట్‌ బీవీ పట్టాభిరామ్‌లతో కూడిన ప్యానల్‌ ఈ అవార్డులకు ఎంపిక చేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణలతో పాటు ఛాముండేశ్వరినాథ్‌ తదితరులు హాజర్యారు.

Story first published: Sunday, October 13, 2019, 17:08 [IST]
Other articles published on Oct 13, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+