Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

క్వార్టర్స్‌లో సింధు.. సైనా, లక్ష్యసేన్, కశ్యప్ ఔట్

PV Sindhu enters All England Open quarterfinals

బర్మింగ్‌హామ్‌: ప్రతిష్టాత్మక ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్‌ షట్లర్, ప్రపంచ చాంపియన్‌ పీవీ సింధు క్వార్టర్‌ ఫైనల్లో‌కి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల ప్రిక్వార్టర్స్‌లో సింధు 21-19, 21-15తో సుంగ్‌ జి హ్యూన్‌ (సౌత్ కొరియా)పై విజయం సాధించింది. 49 నిమిషాల పోరాటంలో తెలుగు అమ్మాయి ఆరంభం నుంచి ఆధిపత్యం చూపెట్టింది.

అలవోకగా..

అలవోకగా..

తొలి గేమ్‌లో సింధుకు ప్రత్యర్థి నుంచి ప్రతిఘటన ఎదురైంది. 19-19తో సమానంగా ఉన్న సమయంలో వరుసగా రెండు పాయింట్లు సాధించిన సింధు గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన సింధు ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా గేమ్‌తో పాటు మ్యాచ్‌నూ గెలుచుకుంది.

ప్రిక్వార్టర్స్‌లో లక్ష్యసేన్..

ప్రిక్వార్టర్స్‌లో లక్ష్యసేన్..

పురుషుల విభాగంలో భారత షట్లర్‌ లక్ష్యసేన్‌కు ప్రిక్వార్టర్స్‌లో చుక్కెదురైంది. ఈ యువ ప్లేయర్ 17-21, 18-21తో రెండో సీడ్‌ విక్టర్‌ అక్సెల్సన్‌ (డెన్మార్క్‌) చేతిలో ఓడాడు. మహిళల డబుల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో అశ్విని పొన్నప్ప-సిక్కిరెడ్డి (భారత్‌) జోడీ 13-21, 14-21తో మిసాకి మత్సుటోమో-అయాక తకహాషి (జపాన్‌) చేతిలో ఓడింది.

సైనా ఇంటికి..

సైనా ఇంటికి..

మరో భారత స్టార్ సైనా నెహ్వాల్.. టోక్యో ఒలింపిక్స్ ఆశలకు భారీ షాక్ తగిలింది. బుధవారం అర్ధరాత్రి దాటాక జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌ మ్యాచ్‌లో సైనా 11-21, 8-21తో మూడో సీడ్‌ అకానె యామగుచి (జపాన్‌) చేతిలో ఓడింది. యామగుచి దూకుడు ముందు నిలువలేకపోయిన సైనా... మ్యాచ్‌ను 23 నిమిషాల్లోనే ప్రత్యర్థికి అప్పగించేసి టోర్నీ నుంచి నిష్క్రమించింది.

సాయి ప్రణీత్, కశ్యప్‌లకు నిరాశే..

సాయి ప్రణీత్, కశ్యప్‌లకు నిరాశే..

పురుషుల విభాగంలో భారత షట్లర్లు భమిడిపాటి సాయిప్రణీత్, పారుపల్లి కశ్యప్‌లకు కూడా నిరాశే ఎదురైంది. సాయిప్రణీత్‌ 12-21, 13-21తో జావో జున్‌పెంగ్‌ (చైనా) చేతిలో ఓడగా... రుస్తావిటో (ఇండోనేసియా)తో జరిగిన మ్యాచ్‌లో కశ్యప్‌ గాయంతో ఆరంభంలోనే వెనుదిరిగాడు. కేవలం నిమిషం పాటు సాగిన ఈ మ్యాచ్‌లో కశ్యప్‌ 0-3తో వెనుకబడిన సమయంలో రిటైర్డ్ హర్ట్‌గా వైదొలిగాడు.

Story first published: Friday, March 13, 2020, 8:14 [IST]
Other articles published on Mar 13, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+