Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Japan Open 2026: పీవీ సింధు శుభారంభం!

జపాన్ ఓపెన్ సూపర్-750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్, మాజీ వరల్డ్ ఛాంపియన్ పీవీ సింధు శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో పీవీ సింధు 21-14, 21-11 తేడాతో మలేషియాకు చెందిన వాంగ్ లింగ్ చింగ్‌‌ను ఓడించింది.

ప్రపంచ 10వ ర్యాంకర్, రెండు సార్లు ఒలింపిక్ విజేత అయిన సింధు.. ఈ మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం చెలాయించి వరుస సెట్లలో విజయం సాధించింది. ఈ మ్యాచ్ ఆరంభం నుంచే మ్యాచ్‌పై పూర్తి ఆధిపత్యం చెలాయించిన సింధు.. ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. తనకే సాధ్యమైన ర్యాలీ, హాఫ్ స్మాష్‌లు, నెట్ డ్రాప్‌లతో వాంగ్ లింగ్ చింగ్‌ను మట్టికరిపించింది.

Japan Open 2026 PV Sindhu Cruises into Second Round as Satwik-Chirag Retire Hurt

తొలి గేమ్‌లో 7-4 ఆధిక్యం సాధించిన సింధు.. కచ్చితమైన షాట్లతో ప్రత్యర్థిపై ఒత్తిడి తీసుకొచ్చింది. వాంగ్ చేసిన అనవసర తప్పిదాలను క్యాష్ చేసుకుంటూ తొలి గేమ్‌ను 21-14తో సొంతం చేసుకుంది. సెకండ్ గేమ్‌లో మరింత దూకుడుగా ఆడిన సింధు.. 8-2, ఆపై 11-3తో భారీ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆఖరి వరకు అదే జోరు కొనసాగిస్తూ 16-5తో ముందంజలో నిలిచింది. చివరికి 21-11తో గేమ్‌ను ముగించి విజయాన్ని కైవసం చేసుకుంది. భారత డబుల్స్ జోడీ సాత్విక్-చిరాగ్ శెట్టి గాయంతో పోటీ నుంచి తప్పుకుంది.

బోణీ కొట్టిన మిక్స్‌డ్ డబుల్స్ జోడీ..

మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత జోడీ ధ్రువ్ కపిలా-తనిషా క్రాస్టో కూడా శుభారంభం చేసి రెండో రౌండ్‌కు అర్హత సాధించింది. భారత ద్వయం 21-16, 21-14 తేడాతో స్కాట్లాండ్‌కు చెందిన అలెగ్జాండర్ డన్-జూలీ మాక్‌ఫర్సన్ జోడీని ఓడించింది. అయితే మరో భారత జోడీ రోహన్ కపూర్-రుత్విక శివానీ గడ్డే మాత్రం ఓటమిపాలైంది. తొలి రౌండ్‌లోనే ఇంటిబాట పట్టింది. టాప్ సీడ్ చైనా జోడీ ఫెంగ్ యాన్ జే-హువాంగ్ డాంగ్ పింగ్ చేతిలో 11-21, 10-21 తేడాతో చిత్తయ్యింది.

Story first published: Tuesday, July 14, 2026, 22:54 [IST]
Other articles published on Jul 14, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+