కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ పతకాలపై అంచనాలొద్దు: గోపిచంద్
గ్లాస్గో వేదికగా జరగనున్న కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత పతకాల సంఖ్యపై భారీ అంచనాలు పెట్టుకోవద్దని భారత బ్యాడ్మింటన్ హెడ్ కోచ్ పుల్లెల గోపిచంద్ అన్నారు. ఈ కామన్వెల్త్ గేమ్స్ నుంచి బ్యాడ్మింటన్, ఇతర ప్రధాన క్రీడలను తొలగించిన నేపథ్యంలో భారత పతకాల సంఖ్యపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు.
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు పతకాలు తెచ్చిపెట్టే క్రీడల్లో బ్యాడ్మింటన్ ఒకటి. కానీ ఖర్చులను తగ్గించుకోవడానికి బ్యాడ్మింటన్‌తో పాటు పలు క్రీడలను నిర్వాహకులు తొలగించారు. కామన్వెల్త్ గేమ్స్‌లో సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్, పారుపల్లి కశ్యప్, పీవీ సింధు, లక్ష్యసేన్ వంటి స్టార్ క్రీడాకారులు పతకాలు గెలిచారు. సింగిల్స్, డబుల్స్ విభాగాల్లోనూ పతకాలు కొల్లగొట్టారు. కానీ ఈ సారి బ్యాడ్మింటన్ లేకపోవడంతో భారత్‌కు వచ్చే పతకాల సంఖ్య గణనీయంగా తగ్గనుంది. ఇది పుల్లెల గోపీచంద్‌తో పాటు బ్యాడ్మింటన్ వర్గాలను తీవ్రంగా నిరాశపర్చింది.

కామన్వెల్త్ గేమ్స్ 2026 నేపథ్యంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్) నిర్వహించిన ఓ చర్చా కార్యక్రమంలో గోపిచంద్ మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'కామన్వెల్త్ గేమ్స్ బ్యాడ్మింటన్‌కు ఒక ముఖ్యమైన టోర్నీగా ఉండేది. గ్లాస్గోలో జరగబోయే గేమ్స్ నుంచి బ్యాడ్మింటన్‌ను తొలగించడం మాకు పెద్ద షాక్ ఇచ్చింది. ప్రస్తుతం ఎడిషన్‌కు సంబంధించి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నప్పటికీ.. 2030లో అహ్మదాబాద్ వేదికగా జరిగే కామన్వెల్త్ గేమ్స్‌లో బ్యాడ్మింటన్‌ను తిరిగి చేర్చుతారని ఆశిస్తున్నాం.
భారత క్రీడాకారులు కామన్వెల్త్ గేమ్స్‌లో బాగా రాణించారు. ఇప్పుడు వారు గతంలో కంటే బలంగా ఉన్నారు. అయితే భారత్‌కు సంబంధించిన అనేక ప్రధాన క్రీడలను తొలగించిన నేపథ్యంలో పతకాల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. అందరూ ఈ విషయాన్ని గ్రహించాలి. బ్యాడ్మింటన్ అనేది అన్ని వయసుల వారిని, అనేక దేశాలను ఆకర్షించే అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడ. కామన్వెల్త్ గేమ్స్‌కు బ్యాడ్మింటన్‌తో విలువ పెరుగుతుంది. ఇది మా అభిప్రాయం. కామన్వెల్త్ గేమ్స్ కమిటీ ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని బ్యాడ్మింటన్‌ను తిరిగి చేర్చుతుందని మేం ఆశిస్తున్నాం.'అని గోపిచంద్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

