భారత బ్యాడ్మింటన్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రాంకీ రెడ్డి-చిరాగ్ శెట్టిలు చరిత్ర సృష్టించారు. ఒలింపిక్స్ చరిత్రలోనే క్వారర్ట్స్ చేరిన తొలి భారత డబుల్స్ జోడీగా చరిత్రకెక్కారు. పారిస్ ఒలింపిక్స్ 2024లో సాత్విక్-చిరాగ్ క్వార్టర్స్ ఫైనల్స్ చేరడం ద్వారా ఈ ఫీట్ సాధించింది.
జర్మనీ జోడీ మర్క్-మెర్విన్‌తో సోమవారం జరగాల్సిన పురుషుల బ్యాడ్మింటన్ డబుల్స్ మ్యాచ్ రద్దయ్యింది. మార్క్‌కు మోకాలి గాయం కావడంతో అతను టోర్నీ నుంచి తప్పుకున్నాడు. దాంతో నిర్వాహకులు మ్యాచ్‌ను రద్దు చేసారు.

గ్రూప్ సీలో ఆర్టియాంటో-ఆల్పియన్(ఇండోనేషియా) చేతిలో 21-13, 13-10 తేడాతో ఫ్రెంచ్ జోడీ లాబార్-కోర్వీ ఓడిపోవడంతో సాత్విక్-చిరాగ్ క్వార్డర్ ఫైనల్స్‌కు అర్హత సాధించారు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్‌లో మ్యాచ్‌లో లక్ష్యసేన్ 21-19, 21-14 తేడాతో జులియన్(బెల్జియం)పై విజయం సాధించాడు.
మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు కూడా శుభారంభం చేసింది. హ్యాట్రిక్ మెడల్స్‌పై గురిపెట్టిన సింధు తన క్యాంపైన్‌ను ఘనంగా ప్రారంభించింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ గ్రూప్-ఎమ్ తొలి మ్యాచ్‌లో తెలుగు తేజం పీవీ సింధు 21-9, 21-6 తేడాతో మాల్దీవులకు చెందిన అబ్దుల్ రజాక్‌ను చిత్తు చేసింది.
గట్టెక్కిన భారత్..
తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి శుభారంభం చేసిన భారత హాకీ టీమ్.. రెండో మ్యాచ్‌లో మాత్రం తృటిలో ఓటమిని తప్పించుకుంది. సోమవారం పూల్ బీలో అర్జెంటీనాతో జరిగిన మ్యాచ్‌ను భారత్ 1-1తో డ్రా చేసుకుంది. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ (58వ నిమిషం) చివర్లో గోల్ చేసి ఓటమి నుంచి గట్టెక్కించాడు.
మ్యాచ్ అరంభం నుంచే ఇరు జట్లు హోరా హోరీగా తలపడ్డాయి. గోల్ కోసం ఇరు జట్లు ప్రయత్నించినప్పటికీ తొలి క్వార్టర్‌లో సాద్యం కాలేదు. రెండో క్వార్టర్ ఆరంభంలోనే 22వ నిమిషంలో అర్జెంటీనా ప్లేయర్ లూకాస్ మార్టినెజ్ గోల్ చేసి ఆ జట్టు ఖాతా తెరిచాడు. దాంతో భారత్ ఒత్తిడిలోకి వెళ్లింది. స్కోర్‌ను సమం చేయడానికి తీవ్రంగా ప్రయత్నించింది.
ఓటమి తప్పదనుకుంటున్న సమయంలో హర్మన్‌ప్రీత్ సింగ్ గోల్‌తో గట్టెక్కింది. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన భారత హాకీ టీమ్.. ఈ సారి మెరుగైన మెడల్ సాధించాలనుకుంటోంది. ఆరు జట్లు ఉన్న పూల్ బీలో మొదటి నాలుగు స్థానాల్లో నిలిచే జట్లు క్వార్టర్ ఫైనల్ చేరుకుంటాయి.