Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Paris Olympics 2024: పీవీ సింధు శుభారంభం.. ఫైనల్‌కు షూటర్ రమిత!

పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత స్టార్ షట్లర్, టూ టైమ్ ఒలింపిక్ మెడలిస్ట్ పీవీ సింధు శుభారంభం చేసింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో తెలుగు తేజం పీవీ సింధు 21-9, 21-6 తేడాతో మాల్దీవులకు చెందిన అబ్దుల్ రజాక్‌ను చిత్తు చేసింది. మాజీ వరల్డ్ ఛాంపియన్ అయిన సింధుకు రజాక్ కనీస పోటీ ఇవ్వలేకపోయింది.

దాంతో సింధు వరుస గేమ్‌ల్లో విజయం సాధించింది. కేవలం 29 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో సింధు స్మాష్‌లకు మాల్దీవల ప్లేయర్ తేలిపోయింది. బుధవారం జరగనున్న రెండో రౌండ్‌లో పీవీ సింధు ఎస్తోనియా ప్లేయర్ క్రిస్టినా కుబాతో తలపడుతోంది.

Paris Olympics 2024 PV Sindhu Wins her Opening Group Game Shooter Ramita Jindal Qualifies for Medal Round

రోయింగ్‌ ఈవెంట్‌లో భారత అథ్లెట్ బాల్‌రాజ్ పన్వార్ సత్తా చాటాడు. ఆదివారం జరిగిన రిపేఛేజ్ విభాగం రెండో రౌండ్‌లో అద్భుత ప్రదర్శనతో క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించాడు. మొనాకో అథ్లెట్ క్వింటిన్ ఆంటోగ్నేల్లి తొలి స్థానం సాధించగా.. రెండో స్థానంలో నిలిచి బాల్‌రాజ్ క్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు.

మహిళల 10 మీటర్ల రైఫిల్ షూటింగ్ విభాగంలో భారత అథ్లెట్ రమిత ఫైనల్‌కు చేరింది. 631.5 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచి ఫైన్లకు అర్హత సాధించింది.

Story first published: Sunday, July 28, 2024, 15:30 [IST]
Other articles published on Jul 28, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+