పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత షట్లర్లు దుమ్మురేపుతున్నారు. ఇప్పటికే మహిళల సింగిల్స్‌లో స్టార్ షట్లర్ పీవీ సింధు ప్రీ క్వార్టర్స్ చేరగా.. తాజాగా పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్ ప్రీ క్వార్టర్స్‌కు అర్హత సాధించాడు. బుధవారం జరిగిన తన చివరి లీగ్ మ్యాచ్‌లొ లక్ష్యసేన్ 21-18, 21-12 తేడాతో ప్రపంచ నాలుగో ర్యాంకర్, ఇండోనేషియా షట్లర్ జొనాథన్ క్రిస్టీపై విజయం సాధించింది.
తొలి గేమ్‌లో ఇండోనేషియా బాక్సర్ నుంచి గట్టి పోటీని ఎదుర్కొన్న లక్ష్యసేన్.. ఓ దశలో 2-8తో వెనుకబడి ఓటమి దిశగా సాగాడు. కానీ ఆ తర్వాత అద్భుత పుంజుకొని ఆధిక్యం సాధించడంతో పాటు గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. రెండో గేమ్‌లోనూ ఇదే జోరును కనబర్చి సునాయసంగా విజయం సాధించాడు.

దాంతో గ్రూప్-ఎల్ నుంచి ప్రిక్వార్టర్స్‌కు అర్హత సాధించాడు. మొత్తం 16 గ్రూప్స్ నుంచి ఒక్కో ప్లేయర్ క్వార్టర్ ఫైనల్‌కు చేరనున్నారు. అంతకుముందు తెలుగు తేజం పీవీ సింధు రెండో విజయాన్ని నమోదు చేసింది. తన చివరి గ్రూప్ మ్యాచ్‌లో సింధు 21-5, 21-10 తేడాతో ఎస్తేనియా క్రీడాకారిణి క్రిస్టినా కూబాను ఓడించింది. ఈ గెలుపుతో ప్రిక్వార్టర్స్‌కు అర్హత సాధించింది.
73వ ర్యాంకర్ క్రిస్టినా కూబాపై పదో సీడ్ సింధు ఆది నుంచి విరుచుకుపడింది. మ్యాచ్ ప్రారంభమైన కాసేపటిలోనే మూడు పాయింట్లు సాధించింది. ఆ తర్వాత సింధు తిరిగి వెనక్కి చూడలేదు. ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా తొలి గేమ్‌ను ఏకపక్షంగా మార్చింది. అదే జోరును రెండో గేమ్‌లోనూ కొనసాగించి రౌండ్-16కు చేరింది. మ్యాచ్‌ను 34 నిమిషాల్లోనే ముగించింది.
గ్రూప్-ఎమ్‌లో సింధు అగ్రస్థానంలో నిలిచింది. రెండు మ్యాచ్‌ల్లో గెలిచి నాలుగు పాయింట్లు సాధించింది. తొలి మ్యాచ్‌లో మాల్దీవులకు చెందిన అబ్దుల్ రజాక్‌పై సింధు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రత్యర్థిని చిత్తుచిత్తుగా ఓడించింది. కేవలం 29 నిమిషాల్లోనే 21-9, 21-6తో మ్యాచ్‌ను ముగించింది.
కాగా, రియో ఒలింపిక్స్‌లో రజతం, టోక్యోలో కంచు మోత మోగించిన సింధు ఈ విశ్వక్రీడల్లోనూ పతక లక్ష్యంగా బరిలోకి దిగింది. పారిస్ ఒలింపిక్స్‌లో సింధు పతకం సాధిస్తే .. ఒలింపిక్స్‌లో మూడు పతకాలు సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా ఆమె చరిత్రకెక్కుతుంది.