పారిస్ ఒలింపిక్స్ 2024లో మెడల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగనున్న బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్‌శెట్టికి ఈజీ డ్రా లభించింది. గ్రూప్-సీలో మూడో సీడ్‌గా బరిలోకి దిగనున్న ఈ భారత జంటకు ప్రపంచ ఆరో ర్యాంకు జోడీ ఫజార్-రియాన్(ఇండోనేషియా) నుంచి మాత్రమే గట్టి పోటీ ఎదురు కానుంది.
కార్వీ-లబార్(ప్రపంచ 31వ ర్యాంక్, ఫ్రాన్స్), లాంఫస్-సీడెల్(43వ ర్యాంక్, జర్మనీ) జోడీలు కూడా ఈ గ్రూప్‌లోనే ఉన్నాయి. పారిస్ ఒలింపిక్స్‌లోని బ్యాడ్మింటన్ పురుషులు, మహిళల సింగిల్స్ డ్రాలను గత శుక్రవారమే ప్రకటించారు. డబుల్స్ జోడీల విషయంలో క్రీడల ఆర్బిట్రేషన్‌లో కేసు నడుస్తుండటంతో ఈ ఈవెంట్ డ్రా వాయిదా పడింది. ముందుగా డబుల్స్‌లో 16 జోడీలే ఒలింపిక్స్‌కు అర్హత సాధించగా.. తాజా కోర్టు తీర్పుతో 17వ జంటగా కార్వీ-లబార్ జోడీని డ్రాలో చేర్చారు. దాంతో తాజాగా డబుల్స్ డ్రాలను ప్రకటించారు.

సింధు, ప్రణయ్‌లకు ఈజీ డ్రా
బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, హెచ్‌ఎస్ ప్రణయ్‌లకు సులువైన డ్రా లభించింది. గ్రూప్ దశను వీరిద్దరు అధిగమించడం దాదాపు ఖాయమే. పారిస్ ఒలింపింక్స్‌లో పదో సీడ్‌గా బరిలోకి దిగుతున్న సింధు గ్రూప్-ఎమ్‌లో రెండు మ్యాచ్‌లు ఆడనుంది. ప్రపంచ 75వ ర్యాంకర్ క్రిస్టిన్ కుబా (ఎస్తోనియా)తో, ప్రపంచ 111వ ర్యాంకర్ ఫాతిమత్ నభా (మాల్దీవులు)తో సింధు తలపడనుంది.
ఈ ప్రత్యర్థులు కంటే బలమైన సింధు గ్రూప్ దశను సునాయాసంగా దాటే అవకాశం ఉంది. అయితే ప్రిక్వార్టర్స్‌లో చైనా ప్లేయర్, ఆరో సీడ్ హి జింగ్‌జియావోతో సింధు తలపడే అవకాశాలు ఉన్నాయి. హెడ్ టు హెడ్ రికార్డుల్లో సింధు 9-11తో కాస్త వెనుకంజలో ఉన్నా గెలిచే అవకాశాలు ఉన్నాయి. ప్రిక్వార్టర్స్‌లో సింధు గెలిస్తే.. క్వార్టర్స్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్, చైనా క్రీడాకారిణి చెన్ యు ఫైతో పోటీపడాల్సి ఉంటుంది. ముఖాముఖీ రికార్డుల్లో ఇద్దరూ 6-6తో సమంగా ఉన్నారు.
చక్కని ప్రదర్శన చేస్తే సింధు సెమీఫైనల్‌కు చేరుకోవడం ఖాయమే. అయితే సెమీస్‌లో కఠిన ప్రత్యర్థి, రియో ఒలింపిక్స్ విజేత కరోలినా మారిన్ (స్పెయిన్)తో సింధు తలపడాల్సి ఉంటుంది. అయితే హెడ్ టూ హెడ్ రికార్డుల్లో కరోలినాకు మెరుగైన రికార్డు ఉంది. వీరిద్దరు ఇప్పటివరకు 17 సార్లు తలపడగా సింధు అయిదు సార్లు మాత్రమే గెలిచింది. కరోలినాపై సింధు గెలిస్తే పతకం ఖాయమవుతోంది.
లక్ష్యసేన్ సైతం..
మరోవైపు పురుషుల సింగిల్స్‌లో లీ డక్‌ఫాట్ (వియత్నాం), ఫాబియన్ రోత్ (జర్మనీ)తో ప్రణయ్ గ్రూప్-కేలో తలపడనున్నాడు. అలాగే గ్రూప్-ఎల్‌లో ఉన్న లక్ష్యసేన్.. జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా), కెవిన్ కార్డన్ (గ్వాటెమాలా), జూలియెన్ కరాజి (బెల్జియం) పోటీపడనున్నాడు. గ్రూప్ దశలో అగ్రస్థానాల్లో నిలిస్తే ప్రిక్వార్టర్స్‌లో ప్రణయ్, లక్ష్యసేన్ పోటీపడే అవకాశముంది.
భారత్@111
పారిస్ ఒలింపిక్స్‌కు రంగం సిద్దమైంది. మరో 10 రోజుల్లో ఈ క్రీడల మహాసంగ్రామానికి తెరలేవనుంది. జూలై 26 నుంచి ఆగస్ట్ 11 వరకు జరిగే ఈ మెగా ఈవెంట్‌లో మొత్తం 32 క్రీడల్లో 329 ఈవెంట్స్‌ల్లో అథ్లెట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
భారత్ నుంచి మొత్తం 111 మంది అథ్లెట్లు మొత్తం 16 క్రీడల్లో పోటీ పడనున్నారు. గత టోక్యో ఒలింపిక్స్‌లో 124 మంది భారత అథ్లెట్లు బరిలోకి దిగగా.. ఈ సంఖ్య ఈసారి 111కు పడిపోయింది. క్రీడల సంఖ్య కూడా 18 నుంచి 16కు తగ్గింది. టోక్యో ఒలింపిక్స్‌లో ఫెన్సింగ్, జిమ్నాస్టిక్స్ ఈవెంట్లలో అర్హత సాధించిన భారత ప్లేయర్లు.. ఈ సారి క్వాలిఫై కాలేకపోయారు.