Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Orleans Masters: శ్రీకాంత్, సైనా ముందంజ!

Orleans Masters: Saina Nehwal, Kidambi Srikanth make winning starts

ఓర్లీన్(ఫ్రాన్స్): ఓర్లీన్ మాస్టర్స్ టోర్నమెంట్‌లో భారత బ్యాడ్మింటన్ ప్లేయర్లకు శుభారంభం దక్కింది. కిదాంబి శ్రీకాంత్, సైనా నెహ్వాల్‌తో సహా పలువురు షట్లర్లు టోర్నీలో ముందడుగు వేశారు. శ్రీకాంత్ ప్రి క్వార్టర్స్‌ చేరుకోగా.. ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్స్ సహా గత మూడు టోర్నీలో ఫస్ట్ రౌండ్ మ్యాచ్‌లో 20వ ర్యాంకర్ సైనా నెహ్వాల్ 21-9, 21-5తో 161వ ర్యాంకర్ రేచల్ డార్హా(ఐర్లాండ్)పై అలవోకగా గెలిచింది. ఈ మ్యాచ్‌లో స్థాయికి తగ్గట్టుగా ఆడిన సైనా పూర్తి ఆధిపత్యం చూపెట్టింది.

వరుస పెట్టి పాయింట్లు సాధించి ఫస్ట్ గేమ్ గెలిచిన సైనా సెకండ్ గేమ్‌లో మరింత దూకుడుగా ఆడింది. చూస్తుండగానే గేమ్‌తో పాటు మ్యాచ్‌ను ఖాతాలో వేసుకుంది. మరో మ్యాచ్‌లో భారత్‌కు చెందిన ఐరా శర్మ 12-21, 21-14, 21-17‌తో 110వ ర్యాంకర్ లియోనైస్ హ్యుత్(ఫ్రాన్స్)పై పోరాడి గెలిచింది. ఫస్ట్ గేమ్‌ను ప్రత్యర్థికి కోల్పోయిన ఐరా.. తర్వాత అద్భుతంగా పుంజుకుని వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచి మ్యాచ్ సొంతం చేసుకుంది. కాగా, మిక్స్‌డ్ డబుల్స్ ఫస్ట్ రౌండ్‌లో నెగ్గిన సిక్కిరెడ్డి-ప్రణవ్ జెర్రీ చోప్రా, ధృవ్ కపిల-అశ్విని పొన్నప్ప జంటలు టోర్నీలో సెకండ్ రౌండ్‌కు చేరాయి. మహిళల డబుల్స్‌లో సిక్కి-అశ్విని జోడీ కూడా బోణీ కొట్టింది.

Story first published: Thursday, March 25, 2021, 9:48 [IST]
Other articles published on Mar 25, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+