‘అర్జున’కు ప్రణయ్.. అండగా గోపీచంద్

న్యూఢిల్లీ: భారత స్టార్ షట్లర్ హెచ్‌ఎస్ ప్రణయ్‌కు నేషనల్ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ అండగా నిలిచాడు. రాజీవ్ ఖేల్‌రత్న అవార్డు గ్రహీత హోదాలో ప్రణయ్ పేరును
అర్జున అవార్డుకు సిఫారసు చేశాడు. అయితే ఈ ఏడాది అర్జున అవార్డు ప్రతిపాదనకు ఎంపిక చేసిన వారి జాబితాలో ప్రణయ్, కిదాంబి శ్రీకాంత్ పేర్లను భారత బ్యాడ్మింటన్ అసోసియేషన్(బాయ్) పక్కనబెట్టింది.
క్రమశిక్షణ ఉల్లంఘన కారణాలతో వరుసగా రెండో ఏడాది కూడా ఈ ఇద్దరిని పక్కనబెట్టిన బాయ్.. యువ ఆటగాళ్లు సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ షెట్టి, సమీర్ వర్మల పేర్లను అర్జునకు నామినేట్ చేసింది.
దీంతో బాయ్‌పై ప్రణయ్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. 'మళ్లీ అదే పాత కథ.. ప్రతిభ గల ఆటగాడికి మరోసారి అన్యాయం జరిగింది' అంటూ వరుసగా ట్వీట్లు చేశాడు. దీంతో మరోసారి బాయ్ నుంచి షోకాజ్ నోటీసులు అందుకున్నాడు. కాగా.. ఈనెల 3న ప్రణయ్ పేరును అర్జునకు గోపీ నామినేట్ చేశాడు.
మరోవైపు, క్రమశిక్షణ ఉల్లంఘన విషయం గోపీకి తెలియదని బాయ్ వర్గాలు తెలిపాయి. ఇక షోకాజ్ నోటీసులు అందుకున్న శ్రీకాంత్ క్షమాపణ చెప్పడంతో అతనని ఖేల్ రత్నకు రికమెంట్ చేసినట్లు ప్రకటించాయి. అయితే, ఈ వ్యవహారంపై వ్యాఖ్యానించడానికి గోపీ విముఖత వ్యక్తం చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications