For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Malaysia Open:ఇదేందయ్యా ఇది.. మేం ఏడ చూడలే! వర్షంతో బ్యాడ్మింటన్ మ్యాచ్‌ వాయిదా? (వీడియో)

మలేషియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ హెచ్ ఎస్ ప్రణయ్‌కు వింత అనుభవం ఎదురైంది. మ్యాచ్ మధ్యలో పైకప్పు లీకేజీ కారణంగా ప్రణయ్ తొలి రౌండ్ మ్యాచ్‌ నేటి(బుధవారం)కి వాయిదా పడింది. కెనడా షట్లర్ బ్రయాన్ యాంగ్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో 21-12, 6-3తో ప్రణయ్ ఆధిక్యంలో ఉన్న సమయంలో వర్షం నీరు పైకప్పు నుంచి లీకైంది.

25 నిమిషాల పాటు ఈ లీకేజీ కొనసాగడంతో మ్యాచ్‌కు గంటపాటు అంతరాయం కలిగింది. ఆ తర్వాత మ్యాచ్ తిరిగి ప్రారంభమవ్వగా.. మరోసారి నీరు కారడంతో రిఫరీలు మ్యాచ్‌ను వాయిదా వేసారు. మ్యాచ్ ఆగిపోయే సమయానికి రెండో గేమ్‌లో బ్రయాన్ యాంగ్ 11-9తో ఆధిక్యంలో ఉన్నాడు. మ్యాచ్ ఆగి పోయిన దగ్గర్నుంచే(21-12, 9-11) మ్యాచ్‌ను నిర్వహించనున్నారు.
ఈ ఘటనపై నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. వర్షంతో బ్యాడ్మింటన్ మ్యాచ్‌ ఆగిపోవడం ఇప్పటి వరకు చూడలేదని, 'ఇదేందయ్యా ఇది.. మేం ఏడ చూడలే'అని సెటైర్లు పేల్చుతున్నారు.

Malaysia Open Fans Reactions After HS Prannoy s Match Stopped For Over 2 Hours After Water Leaks From Roof

లక్ష్యసేన్ ఓటమి..
భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. పారిస్ ఒలింపిక్స్ 2024 అనంతరం లక్ష్యసేన్ వరుస పరాజయాలను ఎదుర్కొంటున్నాడు. తాజా మలేషియా ఓపెన్ టోర్నీలోనూ లక్ష్యసేన్ తీవ్రంగా నిరాశపరిచాడు. తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టాడు.

మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో లక్ష్యసేన్ 14-21, 7-21 తేడాతో చైనీస్ తైపీకి చెందిన చియున్ జెన్ చేతిలో చిత్తయ్యాడు. ఈ మ్యాచ్‌లో లక్ష్యసేన్ కనీస పోటీ ఇవ్వలేక రెండు గేముల్లో ఓటమిపాలయ్యాడు. తొలి గేమ్‌లో కాస్త పోరాడినా.. రెండో గేమ్‌లో చైనీస్ తైపీ షట్లర్ ధాటికి తేలిపోయాడు.

గాయత్రి జోడీ ముందంజ..
భారత మహిళల డబుల్స్ జోడీ గాయత్రి గోపీచంద్-ట్రీసా జాలీ శుభారంభం చేశారు. మంగళవారం జరిగిన తొలి రౌండ్‌లో భారత జోడీ 21-10, 21-10 తేడాతో థాయలాండ్ ద్వయం ఆర్న్‌నిచా-సుకితపై విజయం సాధించారు. ఈ గెలుపుతో ప్రీక్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టారు. ఇటీవలే సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ టోర్నీ గెలిచిన గాయత్రి జోడీ.. అదే జోరును మలేషియా ఓపెన్‌లోనూ కొనసాగిస్తోంది. అలవోకగా రెండు గేమ్స్‌ గెలిచి విజయాన్ని సొంతం చేసుకుంది.

Story first published: Wednesday, January 8, 2025, 10:13 [IST]
Other articles published on Jan 8, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+