Malaysia Open 2025: ప్చ్.. సాత్విక్- చిరాగ్ జోడీ ఓటమి!
పారిస్ ఒలింపిక్స్ 2024 అనంతరం భారత షట్లర్ల నిరాశజనక ప్రదర్శన కొనసాగుతోంది. ఇప్పటికే స్టార్ షట్లర్లు పేలవ ప్రదర్శన కనబరుస్తుండగా.. కాస్తో కూస్తో మెరుగ్గా ఆడుతున్న డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టిలు కూడా టైటిల్ అందుకోలేకపోతున్నారు.
కొత్త ఏడాదిని టైటిల్‌తో ప్రారంభించాలనే లక్ష్యంతో మలేసియా ఓపెన్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నీలో బరిలోకి దిగిన ఈ జోడీ సెమీస్‌లోనే ఇంటిముఖం పట్టింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో సాత్విక్-చిరాగ్ ద్వయం 10-21, 15-21 తేడాతో కొరియా జోడీ కిమ్ వాన్ సియో సెంగ్ చేతిలో చిత్తయ్యింది.

తొలి గేమ్‌లో పూర్తిగా తేలిపోయిన భారత ద్వయం.. అనవసర తప్పిదాలతో బ్రేక్ సమయానికి 6-11తో వెనుకబడింది. అనంతరం కొరియా జోడీ ఆధిపత్యం చెలాయించడంతో తేరుకోలేక గేమ్‌ను కోల్పోయింది. రెండో గేమ్‌లో కాస్త మెరుగ్గా ఆడి బ్రేక్ సమయానికి 11-8తో ఆధిక్యంలో నిలిచింది. కానీ విరామం తర్వాత కొరియా జోడీ దూకుడుగా ఆడుతూ ఆధిపత్యం చెలాయించడం తేలిపోయింది. దాంతో భారత ద్వయానికి ఓటమి తప్పలేదు.
ప్రత్యర్థి జోడీ అసాధారణ ప్రదర్శన కనబర్చిందని, తమకంటే మెరుగ్గా ఆడిందని సాత్విక్ తెలిపాడు. తమ ప్రణాళికలకు తగ్గట్లు ఆడలేకపోయామని దాంతోనే ఓటమి పాలయ్యామని చెప్పాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications