Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బాయ్‌ఫ్రెండ్‌కు స‌డ‌న్ స‌ర్‌ప్రైజ్‌ ఇచ్చిన గుత్తా జ్వాల!!

Jwala Gutta makes surprise visit to boyfriend Vishnu Vishals home for his birthday

చెన్నై: భారత ప్రముఖ బ్యాడ్మింటన్‌ స్టార్ గుత్తా జ్వాల, కన్నడ నటుడు విష్ణు విశాల్‌తో డేటింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. 'నేత్రు ఇంద్రు నలై స్టార్' విష్ణు విశాల్‌ ఈ రోజు తన 36వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. విశాల్‌తో ఒక సంవత్సరానికి పైగా డేటింగ్ చేస్తున్న గుత్తా జ్వాల తన బాయ్‌ఫ్రెండ్ బ‌ర్త్‌డే వేడుకలను జరపడానికి హైద‌రాబాద్ నుంచి చెన్నైకు వెళ్లారు. విశాల్‌కు చెప్పకుండా అతడి‌ ఇంటి ముందు ప్ర‌త్య‌క్ష‌మై స‌డ‌న్ స‌ర్‌ప్రైజ్ చేశారు.

హైద‌రాబాద్ నుంచి చెన్నైకు

కరోనా వైరస్ లాక్‌డౌన్ వ‌ల్ల ప్రేమికుడిని మిస్ అవుతున్నానంటూ గుత్తా జ్వాల విర‌హవేద‌న చెందిన సంగ‌తి తెలిసిందే. ఇక శుక్ర‌వారం పుట్టిన‌రోజు జ‌రుపుకుంటున్న త‌మిళ న‌టుడు విష్ణు విశాల్‌ ఇంటి ముందు ప్ర‌త్య‌క్ష‌మై అత‌డిని స‌డ‌న్ స‌ర్‌ప్రైజ్ చేశారు. ఈ స‌ర్‌ప్రైజ్ కోసం గుత్తా హైద‌రాబాద్ నుంచి చెన్నైకు వెళ్లారు. విశాల్ బ‌ర్త్‌డే వేడుక‌ను ద‌గ్గ‌రుండి నిర్వ‌హించారు. అయితే సాధారణంగా బ‌ర్త్‌డే రోజు ‌ప్రేమికులు ఒక‌రికొరు బ‌హుమ‌తులిచ్చుకుంటారు. అయితే కరోనా నేపథ్యంలో గుత్తా జ్వాల మాత్రం త‌నే పెద్ద గిఫ్ట్ అంటున్నారు.

బ‌ర్త్‌డే స‌ర్‌ప్రైజ్:

బ‌ర్త్‌డే స‌ర్‌ప్రైజ్:

గుత్తా జ్వాల హైద‌రాబాద్ నుంచి చెన్నైకు విషయాన్ని న‌టుడు విష్ణు విశాల్ సోష‌ల్ మీడియాలో పంచుకున్నారు. చేతిలో కేక్ ప‌ట్టుకుని గుత్తాతో క‌లిసి ఉన్న ఫొటోను ఆయన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.‌ 'గుత్తా జ్వాల బ‌ర్త్‌డే స‌ర్‌ప్రైజ్‌ ఇచ్చింది' అని నవ్వుతున్న ఎమోజిని పోస్ట్ చేశారు. మరోవైపు 'హ్యాపీ బ‌ర్త్‌డే బేబీ' అని లవ్ సింబల్ పోస్ట్ చేశారు గుత్తా జ్వాల. ప్రస్తుతం అభిమానులు అందరూ విశాల్‌కు విషెష్ తెలుపుతున్నారు. 'మిస్సింగ్‌ మై బూ' అని గుత్తా జ్వాల మార్చి 28న విష్ణు విశాల్‌తో సన్నిహితంగా తీసుకున్న ఫొటోల్ని ట్విటర్‌లో షేర్‌ చేశారు.

పెళ్లి చేసుకోబోతున్నా:

పెళ్లి చేసుకోబోతున్నా:

గత ఏప్రిల్ నెలలో తమ బంధంపై గుత్తా జ్వాల స్పష్టత ఇచ్చారు. విష్ణు విశాల్‌ను పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపారు. 'మేమిద్దరం డేటింగ్‌లో ఉన్నాం. ఇందులో దాచుకోవడానికి ఏమీ లేదు. మా పెళ్లి జరగబోతోంది. వివాహ తేదీ ఖరారైన తర్వాత, లేదా పెళ్లి ఏర్పాట్లు మొదలు పెట్టినప్పుడు మేమే అధికారికంగా ప్రకటిస్తాం' అని గుత్తా చెప్పారు. మరోవైపు గుత్తాతో తమ సంబంధం గురించి విశాల్ కూడా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. తాము ఏడాదిగా స్నేహితులమని, తరచూ కలుస్తుంటామని చెప్పారు.

చేతన్ ఆనంద్‌తో పెళ్లి:

చేతన్ ఆనంద్‌తో పెళ్లి:

గుత్తా జ్వాల ఫుల్ ఫామ్‌లో ఉన్న సమయంలోనే సహచర ఆటగాడు చేతన్ ఆనంద్‌తో ప్రేమలో పడ్డారు. చాలా కాలం పాటు ప్రేమాయణం సాగించిన తర్వాత వీళ్లిద్దరూ 2005లో వివాహం చేసుకున్నారు. ఆరేళ్ల వైవాహిక జీవితం తర్వాత 2011లో విడిపోయారు. ఇక అప్పటి నుంచి ఆమె ఒంటరిగానే జీవనం సాగిస్తున్నారు. అయితే టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్‌తో డేటింగ్ చేసినట్లు ఆ మధ్యలో వార్తలు వినిపించాయి. మరోవైపు కాస్ట్యూమ్‌ డిజైనర్‌ రజనీ నటరాజ్‌తో 2011లో విష్ణు విశాల్‌ పెళ్లి జరిగింది. కొన్ని కారణాల వల్ల 2018లో వీరు విడాకులు తీసుకున్నారు. వారికి ఆర్య‌న్‌ అనే నాలుగేళ్ల కుమారుడున్నాడు. విష్ణు తమిళంలో దాదాపు 14 సినిమాల్లో నటించారు.

ENGvWI: సిబ్లే సెంచరీ.. స్టోక్స్‌ 99 నాటౌట్.. భారీ స్కోర్ దిశగా ఇంగ్లండ్

Story first published: Friday, July 17, 2020, 18:48 [IST]
Other articles published on Jul 17, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+