Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ENGvWI: సిబ్లే సెంచరీ.. స్టోక్స్‌ 99 నాటౌట్.. భారీ స్కోర్ దిశగా ఇంగ్లండ్

England vs West Indies 2nd Test: Dominic Sibley hundred, Ben Stokes 99* puts England on top at lunch

మాంచెస్టర్: మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ భారీ స్కోర్ దిశగా దూసుకెళుతోంది. రెండో రోజు లంచ్ సమయానికి ఓవర్‌నైట్‌ బ్యాట్స్‌మెన్‌ డొమినిక్‌ సిబ్లే (101: 312 బంతుల్లో 4ఫోర్లు) అద్భుత సెంచరీ బాదాడు. సిబ్లీకిది రెండో టెస్టు సెంచరీ. మరోవైపు స్టార్ ఆల్‌రౌండర్‌ బెన్ ‌స్టోక్స్ ‌(99) సెంచరీకి చేరువలో ఉన్నాడు. విండీస్ బౌలర్లు సెషన్ మొత్తం శ్రమించినా ఫలితం లేకుండా పోయింది. లంచ్‌ విరామ సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 108 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లకు 264 పరుగులు చేసింది. సిబ్లీ (101), స్టోక్స్ ‌(99) క్రీజులో ఉన్నారు. ‌

తొలిరోజు (గురువారం) మ్యాచ్ సమయానికి ముందు చిరు జల్లులు కురవడంతో టాస్‌ రెండు గంటలు ఆలస్యం అయింది. అనంతరం టాస్ గెలిచిన విండీస్ కెప్టెన్ జేసన్ హోల్డర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. వర్షం పడి పిచ్‌ తడిగా ఉండడంతో విండీస్ బౌలర్లు విసిరే బంతులను ఇంగ్లీష్ బ్యాట్స్‌మన్‌లు ఆచితూచి ఆడారు. దీంతో స్కోరు బోర్డు ముందుకు సాగలేదు. రోచ్, గాబ్రియేల్, జోసెఫ్, హోల్డర్‌లు వికెట్లు తీయలేకపోయారు. దీంతో రంగంలోకి దిగిన రోస్టన్ ఛేజ్ తొలి వికెట్ పడగొట్టాడు.

ఓపెనర్ రోరీ బర్న్స్ (15) 14వ ఓవర్ రెండో బంతికి ఎల్బీగా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత బంతికి జాక్ క్రాలే డకౌట్ అయ్యాడు. దీంతో విండీస్ రెండు వికెట్లు కోల్పోయింది. అయితే మరో ఓపెనర్ సిబ్లీకి కెప్టెన్ జో రూట్ జతకలిశాడు. ఇద్దరు కలిసి 60 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పక.. రూట్ (23) జోసెఫ్ చేతికి చిక్కాడు. అనంతరం బెన్ స్టోక్స్ అండతో సిబ్లీ మరో వికెట్ పడకుండా తొలి రోజుని ముగించాడు.

ఓవర్‌నైట్‌ స్కోర్ 207/3తో రెండో రోజు ఆట కొనసాగించిన ఇంగ్లండ్ అద్భుతంగా ఆడింది. సిరీస్‌లో నిలవాలని సిబ్లే, స్టోక్స్ పట్టుదలతో ఆడుతున్నారు. తీవ్ర ఒత్తిడిలోనూ సంయమనంతో ఇన్నింగ్స్‌ను ముందుండి నడిపిస్తున్నారు. ఈ జోడి ఇప్పటికే 183 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. తొలి టెస్టులో రెచ్చిపోయిన విండీస్‌ బౌలర్లు ఈ జోడీని విడదీసేందుకు శ్రమిస్తున్నారు. రెండోరోజు ఆట మొదటి సెషన్‌లో ఇంగ్లండ్ ఆధిపత్యం కొనసాగింది.

Story first published: Friday, July 17, 2020, 21:16 [IST]
Other articles published on Jul 17, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+