Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India Open 2022: సెమీస్‌లో సింధు, లక్ష్యసేన్!

India Open 2022: PV Sindhu and Lakshya Sen advance into semi-finals

న్యూఢిల్లీ: ఒలింపిక్స్ డబుల్ మెడలిస్ట్ పీవీ సింధు.. ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో సెమీఫైనల్ చేరుకుంది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్లో టాప్ సీడ్ సింధు 21-7, 21-8తో అష్మితా చాలిహా(భారత్‌పై) గెలిచింది. 36 నిమిషాల పోరులో 21 ఏళ్ల అష్మితా సెకండ్ గేమ్‌లో మాత్రమే ఫర్వాలేదనిపించింది. సూపర్ సర్వీస్‌లు కొట్టిన సింధు.. 11-5తో ఓపెనింగ్ గేమ్‌లో జోరు చూపెట్టింది.

బ్రేక్ తర్వాత అష్మితా రెండు పాయింట్లు నెగ్గినా.. సింధు వరుసగా 10 పాయింట్లు సాధించి ఈ గేమ్‌ను సొంతం చేసుకుంది. సెకండ్ గేమ్‌లో అష్మితా బాగా ఆడటంతో ఓ దశలో స్కోర్ 9 -9తో ఈక్వల్ అయ్యింది. అయితే బ్రేక్ వరకు ఒక పాయింట్ లీడ్‌తో ఉన్న సింధు.. దానిని 15-11కు పెంచుకుంది. అయినా పట్టు విడవకుండా పోరాడినా అష్మితా 15-15తో మరోసారి స్కోర్ సమం చేసి రేస్‌లోకి వచ్చింది.

ఆ వెంటనే స్ట్రాటజీ మార్చిన సింధు వరుసగా నాలుగు గేమ్ పాయింట్లు సాధించింది. పురుషుల సింగిల్స్‌ క్వార్టర్ ఫైనల్లో లక్ష్యసేన్ 14-21, 21-9, 21-14తో హెచ్ ఎస్ ప్రణయ్‌పై గెలిచాడు. పురుషుల డబుల్స్‌లోసాత్విక్-చిరాగ్ శెట్టి 21-18, 21-18‌తో హీ యంగ్ కై టెరి-లో కీన్ హన్(సింగపూర్)‌ను ఓడించారు.

మరో స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ప్రిక్వార్టర్‌లోనే ఇంటిదారిపట్టిన విషయం తెలిసిందే. మాళవిక బన్సోద్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 31 ఏళ్ల‌ సైనా 21-17, 21-9 తేడాతో ఓట‌మి పాలైంది. మ‌రోవైపు ఇండియా ఓపెన్‌లో క‌రోనా క‌ల‌క‌లం రేగింది. ఏకంగా ఏడుగురు భార‌త క్రీడాకారులు వైర‌స్ బారిన ప‌డ్డారు. క‌రోనా బారిన ప‌డ్డ వారిలో స్టార్ ఆట‌గాళ్లు కిదాంబి శ్రీ‌కాంత్‌తోపాటు అశ్విని పొన్న‌ప్ప కూడా ఉన్నారు. రితికా రాహుల్ థాకర్, ట్రీసా జాలీ, మిథున్ మంజునాథ్, సిమ్రాన్ అమన్ సింఘి, ఖుషీ గుప్తా కూడా పాజిటీవ్‌గా తేలారు. దీంతో వీరంతా టోర్నీ నుంచి త‌ప్పుకుని ఐసోలేష‌న్‌లో చికిత్స పొందుతున్నారు.

Story first published: Saturday, January 15, 2022, 12:14 [IST]
Other articles published on Jan 15, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+