
బెర్లిన్: భారత యంగ్ బ్యాడ్మింటన్ ప్లేయర్ లక్ష్యసేన్ అసమాన పోరాటంతో ప్రపంచ నంబర్‌వన్ అక్సెల్‌సెన్‌కు షాకిచ్చి జర్మనీ ఓపెన్ సూపర్ 300 టోర్నమెంట్లో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శనివారం హోరాహోరీగా సాగిన సెమీఫైనల్లో లక్ష్యసేన్ 21-13, 12-21, 22-20 తేడాతో ఒలింపిక్ చాంప్, టాప్ సీడ్ విక్టర్ అక్సెల్‌సెన్(డెన్మార్క్)పై గెలిచాడు.
గంటా 10 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఆద్యంతం దూకుడైన ఆటతో ఆకట్టుకున్న లక్ష్యసేన్.. నిర్ణయాత్మక ఆఖరి గేమ్‌లో 8-15తో వెనుకబడి కూడా పుంజుకుని గెలవడం విశేషం. తొలి గేమ్‌లో విరామ సమయానికి 11-7తో ఆధిక్యంలో నిలిచిన లక్ష్యసేన్ ఆ తర్వాత అదే జోరు ప్రదర్శించాడు. ఈ క్రమంలో ఈ ఇద్దరి మధ్య జరిగిన 54 షాట్ల ర్యాలీ మ్యాచ్‌కే హైలైట్. అదే ఊపులో సేన్ గేమ్ కూడా చేజిక్కించుకున్నాడు. కానీ రెండో గేమ్‌లో అక్సెల్‌సెన్ పుంజుకున్నాడు. గేమ్ గెలిచి మ్యాచ్‌లో నిలిచాడు.
నిర్ణయాత్మక మూడో గేమ్‌లో 11-8తో విరామానికి వెళ్లిన అక్సెల్‌సెన్... ఆ తర్వాత 16-9తో సులభంగా మ్యాచ్ గెలిచేలా కనిపించాడు. కానీ లక్ష్యసేన్ పట్టు వదల్లేదు. వరుస పాయింట్లతో 19-19తో స్కోరు సమం చేశాడు. అయితే అక్సెల్‌సెన్ కూడా పుంజుకోవడంతో స్కోరు 20-20 కావడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. కానీ వరుసగా రెండు పాయింట్లు సాధించిన లక్ష్యసేన్.. గేమ్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచాడు. అక్సెల్‌సెన్‌పై లక్ష్యసేన్‌కు ఇదే తొలి విజయం కావడం గమనార్హం.