For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

French Open 2024: సాత్విక్ జోడీ శుభారంభం

ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ సూపర్ 750 టోర్నీలో భారత డబుల్ స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టిలు శుభారంభం చేసారు. పారిస్ ఒలింపిక్స్‌ 2024లో బ్యాడ్మింటన్ నిర్వహించే వేదికలోనే జరుగుతున్న ఈ టోర్నీలో మంగళవారం పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో సాత్విక్ జోడీ 21-13, 24-22 తేడాతో ఆన్‌యి సీన్-టేయి(మలేసియా) జోడీపై విజయం సాధించింది.

రెండో రౌండ్‌లో మాన్‌వీయ్-కయ్ వుమ్ ద్వయంతో సాత్విక్-చిరాగ్ శెట్టిలు తలపడనున్నారు. మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి-ట్రీసా జాలీ ద్వయం కూడా శుభారంభం చేసింది. తొలి రౌండ్‌లో గాయత్రి-ట్రీసా 16-21, 21-19, 21-17 తేడాతో భారత్‌కే చెందిన అశ్విని పొన్నప్ప-తనీషా క్రాస్టోపై చెమటోడ్చి విజయం సాధించారు.

French Open 2024 Satwik-Chirag Lakshya Sen and Treesa-Gayatri win Ashwini-Tanisha Priyanshu loses

పురుషుల సింగిల్స్‌లో మాత్రం భారత్‌కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. తొలి రౌండ్‌లో లక్ష్యసేన్ 15-21, 21-15, 21-3తో సునెయమా(జపాన్‌)పై నెగ్గగా.. ప్రియాంశు రజావత్ 8-21, 15-21 తేడాతో టాప్ సీడ్ విక్టర్ అక్సెల్‌సెన్(డెన్మార్క్) చేతిలో పరాజయం పాలయ్యాడు.

Story first published: Wednesday, March 6, 2024, 9:58 [IST]
Other articles published on Mar 6, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+