Canada Open టైటిల్ గెలుచుకున్న లక్ష్య సేన్!
కాల్గరీ: కెనడా ఓపెన్‌లో భారత స్టార్ షట్లర్, కామన్వెల్త్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ లక్ష్యసేన్ దుమ్ము రేపాడు. సోమవారం హోరాహోరీగా సాగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్ షై ఫెంగ్ (చైనా)పై లక్ష్యసేన్ విజయం సాధించి టైటిల్ గెలిచాడు. ఈ మ్యాచ్‌లో లక్ష్యసేన్ 21-18 22-20 తేడాతో వరుస గేమ్‌ల్లో విజయం సాధించి చైనా షట్లర్‌ను చిత్తు చేశాడు.
లక్ష్యసేన్‌కు కెరీర్‌లో ఇది రెండో బీడబ్ల్యూఎఫ్ సూపర్ 500 టైటిల్ కావడం విశేషం. ప్రపంచ 19వ ర్యాంకర్‌గా ఉన్న లక్ష్యసేన్ తన కన్నా ప్రపంచ 10వ ర్యాంకులో ఉన్న షై ఫెంగ్‌పై అసాధారణ ఆటతీరును కనబర్చి కెనడా ఓపెన్‌ను కైవసం చేసుకున్నాడు.

మరోవైపు మహిళల విభాగంలో తెలుగు తేజం, భారత స్టార్ షట్లర్ పీవీ సింధు తన వైఫల్యాన్ని కొనసాగిస్తోంది. ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్ అకానె యమగూచితో జరిగిన సెమీ ఫైనల్లో సింధు ఓటమి పాలైంది. ప్రస్తుతం 15వ ర్యాంకులో ఉన్న సింధు.. యమగూచి చేతిలో 14-21, 15-21తో వరుస సెట్లలో ఓడిపోయింది.
కాగా యమగూచి చేతిలో సింధుకు ఇది వరుసగా రెండో ఓటమి. సింగపూర్ ఓపెన్‌లోనూ యమగూచి చేతిలోనే ఓడి రౌండ్ దశలోనే ఇంటి దారి పట్టింది. కాగా సింధు చివరగా గత ఆగస్టులో జరిగిన కామన్వెల్గ్ గేమ్స్‌లో గెలిచింది. ఆ తర్వాత గాయాలతో బాధపడుతూ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications