యమగూచిని చిత్తుచేసిన సింధు, సమీర్ వర్మకి పరాభవం

గ్వాంగ్‌జూ: చైనాలోని గ్వాంగ్‌జూ వేదికగా జరుగుతోన్న బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో తొలి మ్యాచ్ గెలిచిన పీవీ సింధు టోర్నీని విజయంతో ఆరంభించింది. ఇదే టోర్నీలో మరో భారత ప్లేయర్ సమీర్ వర్మ మాత్రం అనుకున్న స్థాయిలో రాణించలేక పరాజయానికి గురైయ్యాడు. బలమైన ప్రత్యర్థిని ఎదుర్కొని బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీ మొదటి మ్యాచ్‌లో మేటి ర్యాంకర్‌ను ఓడించింది.

51 నిమిషాలు సాగిన మ్యాచ్‌లో సింధు.
ఈ ఏడాది టాప్ ఫామ్‌లో ఉన్న సింధు.. బుధవారం జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్‌లో రెండో ర్యాంకర్ యామగూచిపై వరుస గేమ్‌లలో విక్టరీ సాధించింది. యామగూచిపై 24, 22, 21-15 స్కోర్‌తో గెలిచి టోర్నీలో శుభారంభాన్ని నమోదు చేసింది. 51 నిమిషాలు సాగిన మ్యాచ్‌లో సింధు.. ఆరంభం నుంచి ఉత్తమ ఆటను కనబరిచింది. ఆరంభ మ్యాచ్‌లో సాధించిన పాయింట్లను నాలుగు నుంచి ఐదుకు పెంచింది.

టాప్-8 క్రీడాకారుల్లో ఒకరిగా సింధు
వాస్తవానికి తొలి గేమ్ మొదట్లో సింధు కాస్త తడబడి వెనుకంజ వేసింది. కానీ ఆ తర్వాత కోలుకుని.. హోరాహోరీగా సాగిన తొలి గేమ్‌ను 24-22 స్కోర్‌తో సింధు సొంతం చేసుకోగలిగింది. ఇక రెండో గేమ్‌ను సింధు ఈజీగానే కొట్టేసింది. వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీలో టైటిల్ కోసం టాప్-8 క్రీడాకారులు పోటీపడుతున్నారు.
కఠినమైన సవాల్ ఎదుర్కొననున్న పీవీ సింధు

సునాయాసంగా ప్రత్యర్థికి అప్పగించేసిన సమీర్
మరో ప్లేయర్ సమీర్ వర్మ గట్టి పోటీని ఎదుర్కోలేక పరాజయానికి గురైయ్యాడు. ప్రపంచ నెం.1 ర్యాంకర్ కెంటో మొమెటో చేతిలో రాణించలేక తొలి మ్యాచ్‌లోనే పరాభవానికి గురైయ్యాడు. తొలి గేమ్‌లో ఎదుర్కొనేందుకు ప్రయత్నించిన సమీర్ వర్మ.. రెండో గేమ్‌ను సునాయాసంగా ప్రత్యర్థికి అప్పగించేశాడు. వర్మ గ్రూప్ బీ మొమొటో, టోమీ సుగిరటో, కంటాఫో వాంగ్‌చారన్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications