Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

BWF World Championship 2022: లక్ష్యసేన్‌పై ప్రణయ్ సంచలన విజయం.. ముగిసిన సైనా పోరాటం!

 BWF World Championship 2022: HS Prannoy beats Lakshya Sen to enter quarter-finals

టోక్యో: ప్రతిష్టాత్మక వరల్డ్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ షట్లర్ హెచ్‌ఎస్ ప్రణయ్ జోరు కొనసాగుతోంది. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో ప్రపంచ మాజీ నెంబర్‌వన్‌, ప్రస్తుత రెండోర్యాంకరైన జపాన్‌ ఏస్‌ ఆటగాడు కెంటో మొమోటాకు అతని సొంత ప్రేక్షకుల మధ్యే దిమ్మదిరిగే షాకిచ్చిన ప్రణయ్.. ప్రీ క్వార్టర్స్‌లో అదే జోరును కొనసాగించాడు. సహచర ఆటగాడు, కామన్వెల్త్ గోల్డ్ మెడలిస్ట్ లక్ష్యసేన్‌తోనే పోటిపడిన ప్రణయ్.. అద్భుత విజయాన్నందుకున్నాడు. గురువారం జరిగిన ప్రీక్వార్టర్స్‌లో హెచ్‌ఎస్ ప్రణయ్ 17-21, 21-16, 21-17తో లక్ష్యసేన్‌ను ఓడించాడు. తొలి గేమ్ కోల్పోయినా.. తర్వాతి రెండు గేమ్‌ల్లో సత్తా చాటి ప్రణయ్ అద్భుత విజయం సాధించాడు.

సైనా ఓటమి..

సైనా ఓటమి..

మహిళల సింగిల్స్‌లో భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ పోరాటం ముగిసింది. టోక్యో వేదికగా గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ఈ లండన్ ఒలింపిక్స్ బ్రాంజ్‌ మెడలిస్ట్‌కు చుక్కెదురైంది. రెండోరౌండ్‌ ప్రత్యర్థి, ప్రపంచ మాజీ చాంపియన్‌ నొజొమి ఒకుహర (జపాన్‌) గాయంతో వాకోవర్‌ ఇవ్వడంతో సైనా నేరుగా మూడోరౌండ్లోకి ప్రవేశించింది. కానీ ఈ అవకాశాన్ని ఆమె అందిపుచ్చుకోలేకపోయింది.

గంటా నాలుగు నిమిషాల పాటు సాగిన సుదీర్ఘ మ్యాచ్‌లో మాజీ వరల్డ్ నెంబర్ వన్ సైనా 17-21, 21-16, 13-21 తేడాతో 12వ సీడ్‌ బుసానన్‌ ఓంగారుంగ్‌ఫాన్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో పోరాడి ఓడింది. ఈ మ్యాచ్‌లో బుసానన్‌ ఆది నుంచే ఆధిపత్యం చెలాయించింది. దీంతో మొదటి గేమ్‌ను సైనా 17-21తో కోల్పోయింది. అయితే, రెండో గేమ్‌లో పుంజుకున్న ఈ లండన్‌ ఒలింపిక్స్‌ కాంస్య విజేత 21-16తో ప్రత్యర్థిని కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఈ క్రమంలో మూడో గేమ్‌లో తిరిగి ఆధిక్యంలోకి వచ్చిన బుసానన్‌ 21-13తో సైనాను ఓడించింది. తద్వారా క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. ఇక అంతకుముందు మ్యాచ్‌లో సైనా.. హాంకాంగ్‌ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ చెయుంగ్ న్గన్ యిను 21-19, 21-9తో ఓడించి ప్రిక్వార్టర్స్‌ వరకు చేరుకుంది.

డబుల్స్ జోడీల జోరు..

డబుల్స్ జోడీల జోరు..

ఇక పురుషుల డబుల్స్‌లో భారత అన్‌సీడెడ్ ప్లేయర్లు ధృవ్ కపిల, ఎంఆర్ అర్జున్ దుమ్మురేపుతున్నారు. గురువారం జరిగిన డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో ధృవ్-అర్జున్ ద్వయం 18-21, 21-15, 21-16 తేడాతో సింగపూర్‌కు చెందిన కేహెచ్ లోహ్, హెచ్ టెర్రీ జోడీని ఓడించారు.

భారత అగ్రశ్రేణి జోడీ సాత్విక్ సాయిరాజ్ రాంకీ రెడ్డి-చిరాగ్ శెట్టిలు క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లారు. ప్రిక్వార్టర్స్‌లో కామన్వెల్త్ గోల్డ్ మెడల్ గెలిచిన ఈ ద్వయం 21-12, 21-10 తేడాతో డానిష్ జంట జెప్పీ బే- లాస్సే మోల్హెడేపై గెలుపొందారు. ఇక క్వార్టర్స్‌లో వీరిద్దరు డిఫెండింగ్ ఛాంపియన్లు అయిన జపాన్ జోడి టకురో హోకి, యుగో కొబయాషితో తలపడనున్నారు.

 కిదాంబి చిత్తుగా..:

కిదాంబి చిత్తుగా..:

గతేడాది రన్నరప్‌, ప్రపంచ మాజీ నెంబర్‌వన్‌ కిడాంబి శ్రీకాంత్‌ మాత్రం ఈసారి విఫలమయ్యాడు. తనకంటే తక్కువ ర్యాంకర్‌ చేతిలో ఓటమిపాలై రెండోరౌండ్లోనే ఇంటిబాట పట్టాడు. 12వ సీడ్‌ శ్రీకాంత్‌ 18-21, 17-21తో చైనాకు చెందిన 32వ ర్యాంకర్‌ జావో జున్‌ పెంగ్‌ చేతిలో పరాజయం పాలయ్యాడు. మ్యాచ్‌లో ప్రత్యర్థి దూకుడు ముందు పూర్తిగా తేలిపోయిన భారత షట్లర్‌ కేవలం 34 నిమిషాల్లోనే వెనుదిరిగాడు.

Story first published: Thursday, August 25, 2022, 17:24 [IST]
Other articles published on Aug 25, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+