భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల తల్లైంది. పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమె భర్త, తమిళ హీరో విష్ణు విశాల్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
'మాకు ఆడపిల్ల పుట్టింది. ఆర్యన్ ఇప్పుడు అన్నయ్య అయ్యాడు. మా నాలుగో పెళ్లి రోజే కూతురు పుట్టడం చాలా సంతోషంగా ఉంది. మాకు దేవుడు ఇచ్చిన బహుమతిగా భావిస్తున్నాం. మీ అందరీ ప్రేమ, ఆశీర్వాదం కావాలి'అని ఎక్స్ వేదికగా పాప ఫొటోను పంచుకున్నారు.
ఇప్పటికే విష్ణు విశాల్‌కు ఆర్యన్ అనే ఒక కొడుకు ఉన్నాడు. ఈ స్టార్ కపుల్‌కు ఇరు రంగాల ప్రముఖులు, అభిమానులు విషెస్ చెబుతున్నారు. సుదీర్ఘ కాలం ప్రేమించుకున్న జ్వాలా-విష్ణు 2021న ఏప్రిల్ 22న పెళ్లి చేసుకున్నారు. నాలుగేళ్ల తర్వాత సరిగ్గా ఇదే రోజు పాప పుట్టడంతో ఎంతో ప్రత్యేకమని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

విష్ణు విశాల్ సోదరి సంగీత్ వేడుకలో తొలిసారి జ్వాల గుత్తాను కలిశాడు. అప్పుడు వీరి మధ్య చిగురించిన స్నేహం ఆ తరవాత ప్రేమగా మారింది. జ్వాల గుత్తా ఫుల్ ఫామ్‌లో ఉన్న సమయంలోనే సహచర ఆటగాడు చేతన్ ఆనంద్‌తో ప్రేమలో పడ్డారు. చాలా కాలం పాటు ప్రేమాయణం సాగించిన తర్వాత వీళ్లిద్దరూ 2005లో వివాహం చేసుకున్నారు.
ఆరేళ్ల వైవాహిక జీవితం తర్వాత 2011లో విడిపోయారు. ఇక అప్పటి నుంచి ఆమె ఒంటరిగానే జీవనం సాగిస్తున్నారు. మరోవైపు కాస్ట్యూమ్ డిజైనర్ రజనీ నటరాజ్‌తో 2011లో విష్ణు విశాల్ పెళ్లి జరిగింది. కొన్ని కారణాల వల్ల 2018లో వీరు విడాకులు తీసుకున్నారు. వారికి ఆర్యన్ అనే నాలుగేళ్ల కుమారుడున్నాడు.