For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

All England Championships: లక్ష్యసేన్ శుభారంభం

ఆల్‌ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత యువ షట్లర్ లక్ష్యసేన్ శుభారంభం చేశాడు. డెన్మార్మ్‌కు చెందిన మాగ్నస్ జొనసెన్‌ను ఓడించి రెండో రౌండ్‌కు దూసుకెళ్లాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో లక్ష్యసేన్ 21-14, 21-14 తేడాతో మాగ్నస్ జొనాసెన్‌పై విజయం సాధించాడు.

తొలి గేమ్ ఆరంభంలో ఇద్దరూ హోరాహోరీగా తలపడ్డారు. ఓ దశలో 8-8తో సమంగా నిలిచారు. అక్కడి నుంచి ఆధిపత్యం చెలాయించిన లక్ష్య సేన్.. వరుసగా నాలుగు పాయింట్స్ సాధించాడు. సూపర్ స్మాష్‌లతో పాటు నెట్ ప్లేతో ప్రత్యర్ధిని ఉక్కిరి బిక్కిరి చేశాడు.

All England Championship Lakshya Sen and Satwiksairaj-Chirag Shetty progress to pre-quarterfinals

రెండు సార్లు వరుసగా మూడేసి పాయింట్లు సాధించి తొలి గేమ్‌ను కైవసం చేసుకున్నాడు. రెండో గేమ్‌లోనే ఇదే జోరును కొనసాగించిన లక్ష్యసేన్.. ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగాడు. వరుసగా పాయింట్లు సాధించి రెండో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు.

ఇతర సింగిల్స్ మ్యాచ్‌లో ప్రియాన్షు రజావత్ 19-21, 21-11, 9-21 తేడాతో చికో ఆరాద్వి వర్దొయో(ఇండోనేషియా) చేతిలో ఓటమిపాలయ్యాడు. పరుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టి జోడీ శుభారంభం చేసింది. బుధవారమే జరిగిన తొలి రౌండ్‌లో సాత్విక్ జోడీ 21-18, 21-14 తేడాతో ఎహ్‌సాన్ మహ్మద్, హెంద్ర(ఇండోనేషియా)పై విజయం సాధించింది.

మరోవైపు మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో తనీషా క్యాస్ట్రో-అశ్విన్ పొన్నప్ప జంట 21-13, 21-18తో హాంకాంగ్‌ జోడీ యుంగ్ గా తింగ్, యుంగ్ పుయ్ లామ్ జోడీపై విజయం సాధించింది.

Story first published: Thursday, March 14, 2024, 7:43 [IST]
Other articles published on Mar 14, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+