Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Steve Smith: ఓటమి బాధలో ఉన్న స్టీవ్ స్మిత్‌ను ఓదార్చిన విరాట్ కోహ్లీ - హత్తుకుని మరీ..(వీడియో వైరల్)

Steve Smith: విరాట్ కోహ్లీ.. మ్యాచ్ ఓడినా గెలిచినా.. తన ప్రదర్శనలో విఫలమైన, మంచిగా ఆడినా.. అభిమానుల మనసును మాత్రం ప్రతీసారి దోచుకుంటూనే ఉంటాడు. తన చర్యలతో ఫ్యాన్స్ ను ఖుషీ ఉంచేందుకే ప్రయత్నిస్తూనే ఉంటాడు. అయితే తాజాగా అతడు మరోసారి తన చర్యలతో క్రికెట్ అభిమానుల మనసును దోచుకోవడంతో పాటు క్రీడా స్ఫూర్తిని చాటాడు. ఓటమి బాధలో ఉన్న స్టీవ్ స్మిత్ ను కౌగలించుకుని ఓదార్చాడు!

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా ఆస్ట్రేలియా - టీమిండియా జరిగిన తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఇద్దరు వరల్డ్ బెస్ట్ బ్యాటర్స్ ఆడారు. వారే కోహ్లీ, స్టీవ్ స్మిత్. ఈ ఇద్దరూ చెరో హాఫ్ సెంచరీలు బాది తమ అభిమానులను అలరించారు. మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ లో స్మిత్ 96 బంతుల్లో 73 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అనంతరం లక్ష్య ఛేదనలో కోహ్లీ 98 బంతుల్లో 84 రన్స్ చేశాడు. కానీ మనోళ్లు విజయం సాధించి ఫైనల్ కు దూసుకెళ్తే.. ఆసీస్ మాత్రం బాధతో ఓడి ఇంటి ముఖం పట్టింది.

Virat kohli hugs Steve Smith fans impressed After Australia loss in champions trophy 2025 semifinal

ఈ క్రమంలోనే మ్యాచ్ అనంతరం ఆసీస్ ఆటగాళ్లు, భారత్ ఆటగాళ్లు కరచాలనం చేసుకున్నారు. ఆ సమయంలో మిగతా ఆటగాళ్లంతా షేక్ హ్యాండ్ మాత్రం ఇస్తుంటే.. కోహ్లీ మాత్రం స్మిత్ దగ్గరికి వెళ్లి హగ్ ఇచ్చాడు. ఓటమి బాధలో ఉన్న అతడికి కాసేపు ఊరటనిచ్చేలా మాటలు చెప్పాడు. ఆ మాటలకు స్మిత్ కూడా కన్విన్స్ అయినట్టుగా కనిపించాడు. ఈ సన్నివేశాలు అక్కడి చూపరుల మనసును తాకాయి. సోషల్ మీడియాలోనూ వైరల్ కాగా క్రికెట్ అభిమానుల హృదయాలను దోచాయి. ఇవి చూసి ఫ్యాన్స్.. కోహ్లీ ఎప్పుడూ కింగే, ప్రతిఒక్కరికీ అండగా ఉంటాడంటూ కామెంట్లు చేస్తున్నారు.

కాగా, ఆస్ట్రేలియా ఈ ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ స్టేజ్ లో కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే పూర్తిగా ఆడింది. ఇంగ్లాండ్ పై ఆడిన మ్యాచ్ లో గెలిచింది. ఇక సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ రద్దు కాగా, అప్ఘానిస్థాన్ తో జరిగిన మ్యాచ్ కూడా మధ్యలోనే వర్షం వల్ల రద్దైపోయింది. సెమీ ఫైనల్ లో టీమిండియా చేతిలో ఓడి ఇంటిముఖం పట్టింది. మరోవైపు భారత జట్టు ఆడిన అన్నీ మ్యాచుల్లో (గ్రూప్ స్టేజ్ లో బంగ్లా, పాకిస్థాన్, న్యూజిలాండ్) విజయం సాధించింది. సెమీస్ లో ఆస్ట్రేలియాపై కూడా గెలిచి ఫైనల్ కు అర్హత సాధించింది.

Story first published: Wednesday, March 5, 2025, 12:46 [IST]
Other articles published on Mar 5, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+