రషీద్ ఖాన్‌కే పట్టం: అమ్ముడుపోని ఆటగాళ్లలో గేల్, మలింగ

హైదరాబాద్: ఇంగ్లండ్‌-వేల్స్‌ క్రికెట్‌ బోర్డు(ఈసీబీ) ప‍్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ద హండ్రెడ్‌ లీగ్‌‌ ప్లేయర్ డ్రాఫ్ట్‌లో ఆప్ఘనిస్థాన్ ఆల్ రౌండర్ రషీద్ ఖాన్, ఆండ్రీ రస్సెల్‌లు అగ్రస్థానంలో నిలిచారు. ఆదివారం ఆటగాళ్ల డ్రాఫ్ట్‌లు పూర్తి కాగా అందులో రషీద్‌ ఖాన్‌ను తొలి జాబితాలోనే మొదటి క్రికెటర్‌గా తీసుకున్నారు.

టీ20ల్లో నెంబర్ వన్ బౌలర్‌గా కొనసాగుతున్న రషీద్ ఖాన్‌ను ట్రెంట్‌ రాకెట్స్‌ జట్టు ఎంపిక చేసింది. గత కొంతకాలంగా అంతర్జాతీయ క్రికెట్‌లో రషీద్ ఖాన్ అద్భుత ప్రదర్శన చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆటగాళ్ల డ్రాఫ్ట్‌లో రషీద్‌ ఖాన్‌ను ట్రెంట్‌ రాకెట్స్‌ కొనుగోలు చేసింది.

ఆటగాళ్ల తొలి రౌండ్‌లో రషీద్ ఖాన్‌తో పాటు విండిస్ హిట్టర్ ఆండ్రూ రస్సెల్‌ను సౌథరన్‌ బ్రేవ్‌ జట్టు కొనుగోలు చేసింది. ఇక, ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ అరోన్‌ ఫించ్‌ నార్తరన్‌ సూపర్‌చార్జర్స్‌ జట్టు కొనుగోలు చేసింది. విండిస్ విధ్వంసకర ఓపెనర్ క్రిస్‌ గేల్‌ను ఏ జట్టూ కొనుగోలు చేసేందుకు ముందుకు రాలేదు.

శ్రీలంక పేసర్‌ లసిత్‌ మలింగాలను కూడా తొలి రౌండ్‌లో ఎవరూ తీసుకోలేదు. క్రిస్ గేల్ కనీస ధర ఎక్కువగా ఉండటంతో అతడిని కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ఆసక్తి కనబర్చలేదు. మరోవైపు ఆస్ట్రేలియా ప్లేయర్లు మిచెల్‌ స్టార్క్‌, స్టీవ్‌ స్మిత్‌లను ద వెల్ష్‌ ఫైర్‌ యాజమాన్యం కొనుగోలు చేసింది. తొలి రౌండ్‌లో ప్రతీ జట్టు కనీసం ఇద్దరు ఆటగాళ్లను ఎంపిక చేసుకుంది.

కాగా, ఈ లీగ్‌లో ఎక్కువ మంది ఇంగ్లాండ్‌ జాతీయ జట్టు తరుపున ఆడుతోన్న ఆటగాళ్లను తీసుకోవడానికే ద హండ్రెడ్‌ ఫ్రాంచైజీలు మొగ్గుచూపడం విశేషం.2020లో నిర్వహించనున్న ద హండ్రెడ్‌ లీగ్‌లో 8 దేశవాళీ జట్లు పాల్గొంటున్నాయి. ఈ వంద బంతుల ఫార్మాట్‌లో 15 సాధారణ ఓవర్లు ఉంటే.. ఒక ఓవర్లో మాత్రం పది బంతులు ఉంటాయి.

టీటీ20 ఫార్మాట్ కన్నా ఇందులో ఓవరాల్‌గా 40 బంతులు తక్కువగా ఉంటాయి కాబట్టి దాదాపు రెండున్నర గంటల సమయం తగ్గుతుంది. 100 బంతుల క్రికెట్ మరింత రసవత్తరంగా మారుతుంది. ఈ లీగ్‌లో మహిళల జట్లు కూడా పాల్గొంటున్నాయి. ప్లేయర్స్ డ్రాప్ట్‌ తొలి రౌండ్‌లో అమ్ముడుపోయిన ఆటగాళ్లు

* రషీద్ ఖాన్(ట్రెంట్‌ రాకెట్స్‌)

* ఆండ్రీ రస్సెల్ (సదరన్ బ్రేవ్)

* ఆరోన్ ఫించ్, ముజీబ్ ఉర్ రెహ్మాన్ (నార్తర్న్ సూపర్ ఛార్జర్స్)

* సునీల్ నరైన్ (ఓవల్ ఇన్విన్సిబుల్స్)

* ఇమ్రాన్ తాహిర్, డేన్ విలాస్ (మాంచెస్టర్ ఒరిజినల్స్)

* గ్లెన్ మాక్స్వెల్ (లండన్ స్పిరిట్)

* లియామ్ లివింగ్స్టోన్ (బర్మింగ్‌హామ్ ఫీనిక్స్)

* మిచెల్ స్టార్క్, స్టీవ్ స్మిత్(వెల్స్ ఫైర్)

* డేవిడ్ వార్నర్(సదరన్ బ్రేవ్)

READ SOURCE