వరణుడి దెబ్బ.. భారత్‌, దక్షిణాఫ్రికా మూడో టీ20 కూడా రద్దు!!

సూరత్: భారత్‌, దక్షిణాఫ్రికా మహిళల టీ20 సిరీస్‌ను వరుణుడు నీడలా వెంటాడుతున్నాడు. ఇప్పటికే రెండో టీ20 వర్షం కారణంగా టాస్ కూడా పడకుండానే రద్దు కాగా.. తాజాగా మూడో మ్యాచ్‌ను కూడా వరుణుడు అడ్డుకున్నాడు. 5 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరగాల్సిన మూడో టీ20 మ్యాచ్ ఒక్క బంతి పడకుండానే రైద్దెంది. వరుణుడి ప్రతాపానికి టాస్‌ కూడా సాధ్యపడలేదు.

ఆదివారం ఉదయం నుంచి భారీ వర్షం కురవడంతో మైదానం మొత్తం చిత్తడిగా మారింది. దీంతో గ్రౌండ్‌ను కవర్స్‌తో కప్పి ఉంచారు. మద్యమద్యలో కూడా జల్లులు కురిశాయి. ఇక మ్యాచ్‌ సమయానికి ముందు మరోసారి వర్ష పడటంతో నిర్ణీత సమయానికి మైదానం ఆటకు సిద్ధంగా లేకుండా పోయింది. 7.30 గంటలకు పరిస్థితిని సమీక్షించిన అంపైర్లు.. మ్యాచ్‌ నిర్వహణ అసాధ్యమని తేల్చారు. దీంతో సిరీస్‌లో వరుసగా రద్దయిన రెండో మ్యాచ్‌ అయింది.

ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌ 1-0తో ఆధిక్యంలో ఉంది. ఉత్కంఠ భరితంగా సాగిన తొలి మ్యాచ్‌లో 11 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. నాలుగో మ్యాచ్‌ కూడా ఇక్కడే మంగళవారం జరుగుతుంది. అక్టోబర్‌ 4న చివరి వన్డే జరగనుంది. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా చివరి రెండు మ్యాచ్‌లకు భారత మహిళల జట్టును బీసీసీఐ శనివారం ప్రకటించింది. తొలి మూడు టీ20లకు ఎంపిక చేసిన జట్టునే ఎలాంటి మార్పులు లేకుండా కొనసాగించింది.

మిథాలీ రాజ్ స్థానంలో అరంగేట్రం చేసిన 15 ఏండ్ల షఫాలీ వర్మపై అందరి దృష్టి ఉంది. దూకుడుగా ఆడే షఫాలీ బ్యాట్ జులిపించాలని అందరూ అనుకుంటుండగా.. వరణుడు అడ్డుపడ్డాడు. భారత స్టార్ స్పిన్నర్ దీప్తి శర్మ మొదటి టీ20లో అద్భుత స్పెల్ వేసిన విషయం తెలిసిందే. 4 ఓవర్లలో కేవలం 8 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసి టీమిండియాకు ఊహించని విజయాన్ని అందించింది. వచ్చే టీ20లలో కూడా ఈ ఇద్దరిపైనే అందరి దృష్టి ఉండనుంది.

READ SOURCE