India vs South Africa, 1st Test Day 2: లంచ్ విరామానికి టీమిండియా 324/1

హైదరాబాద్: విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో రెండో రోజైన గురువారం లంచ్ విరామ సమయానికి టీమిండియా వికెట్ నష్టానికి 324 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో మయాంక్ అగర్వాల్(138), పుజారా(6) పరుగులతో క్రీజులో ఉన్నారు.

202/0 ఓవర్‌నైట్‌ స్కోరుతో గురువారం రెండో రోజు ఆట కొనసాగించిన టీమిండియా జట్టు స్కోరు 317 పరుగుల వద్ద రోహిత్ శర్మ వికెట్‌ను చేజార్చుకుంది. రెండో రోజు ఆటలో మరో 115 పరుగులు జోడించిన తర్వాత రోహిత్ శర్మ(244 బంతుల్లో 176, 23 ఫోర్లు, 6 సిక్సులు) సఫారీ బౌలర్ మహరాజ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ క్వింటన్ డీకాక్ స్టంపౌట్ చేశాడు.

దీంతో రోహిత్ శర్మ నిరాశగా పెవిలియన్‌కు చేరాడు. టెస్టుల్లో రోహిత్‌ శర్మకు ఇది నాలుగో సెంచరీ. అంతకుముందు మిగతా మూడు సెంచరీలు మిడిల్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చి నమోదు చేయగా... ఈ సెంచరీని ఓపెనర్‌గా చేశాడు. ఫలితంగా ధావన్, రాహుల్, పృథ్వీ షా తర్వాత ఓపెనర్‌గా బరిలోకి దిగిన తొలి ఇన్నింగ్స్‌లోనే సెంచరీ చేసిన నాలుగో భారత బ్యాట్స్‌మన్‌ రోహిత్‌ నిలిచాడు.

ఈ మ్యాచ్‌లో ఓపెనర్లు ఇద్దరూ 300కుపైగా పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేయడం విశేషం. తొలి రోజు రోహిత్ శర్మ సెంచరీతో రాణించగా... రెండో రోజైన బుధవారం మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ సెంచరీతో సాధించాడు. టెస్టుల్లో మయాంక్ అగర్వాల్‌కు ఇదే తొలి సెంచరీ కావడం విశేషం.

భారత జట్టు కోల్పోయిన ఆ ఒక్క వికెట్‌ను సఫారీ బౌలర్ కేశవ్ మహారాజ్ దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఓపెనర్లు ఇద్దరూ 300కుపైగా పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేయడం విశేషం. ఈ క్రమంలో అనేక రికార్డులను వీరిద్దరూ బద్దలు కొట్టారు. భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఏ వికెట్‌కైనా అత్యుత్తమ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.

ఈ క్రమంలో వీరిద్దరూ ప్రతి ఓవర్‌లోనూ బౌండరీ బాదారు. వీరిద్దరి కట్టడి చేసేందుకు సఫారీ బౌలర్లు విఫలమయ్యారు.

280* M Agarwal - R Sharma Vizag 2019/20 (1st) -- Today

268 V Sehwag - R Dravid Chennai 2007/08 (2nd)

259* VVS Laxman - MS Dhoni Kolkata 2009/10 (7th)

READ SOURCE