IND vs SA: షమీ, జడేజా విజృంభణ.. టీమిండియా విజయానికి 2 వికెట్లే!!

విశాఖ: మూడు టెస్ట్ మ్యాచ్ సిరీస్‌లో భాగంగా విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా విజయానికి చేరువయింది. టీమిండియా విజయానికి కేవలం రెండు వికెట్ల దూరంలో మాత్రమే నిలిచింది. చివరి రోజు ఉదయం భారత బౌలర్ల హవా కొనసాగుతోంది. పేసర్‌ మహ్మద్‌ షమీ, స్పిన్నర్ రవీంద్ర జడేజా పోటీపడి వికెట్లు తీయడంతో దక్షిణాఫ్రికా పీకల్లోతు కష్టాల్లోకి వెళ్ళింది. చివరిరోజు ఆటలో భాగంగా దక్షిణాఫ్రికా 70 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయి ఎదురీదుతోంది.

షమీ మ్యాజిక్‌:

ఆదివారం 11/1 ఓవర్‌నైట్‌ స్కోరుతో ఆటను కొనసాగించిన దక్షిణాఫ్రికాకు ఆదిలోనే షాక్ తగిలింది. మ్యాచ్‌ ప్రారంభమైన రెండో ఓవర్‌లోనే డిబ్రుయిన్‌ (10)ను స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్‌ అశ్విన్‌ బౌల్డ్‌ చేసాడు. ఇక ఆ తర్వాతి ఓవర్‌లో పేసర్ మహ్మద్‌ షమీ ..తెంబ బువుమా (0)ను పెవిలియన్‌ చేర్చాడు. అనంతరం మరింత రెచ్చిపోయిన షమీ.. 40 పరుగుల వ్యవధిలో మూడు వికెట్లను తీసి దక్షిణాఫ్రికా టాపార్డర్‌ వెన్నువిరిచాడు. డుప్లెసిస్‌ (13), డీకాక్‌ (0)లను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. పదునైన స్వింగ్‌తో పాటు బౌన్స్‌తో షమీ చెలరేగిపోయాడు.

జడేజా విజృంభణ:

ఆపై రవీంద్ర జడేజా షమీకి తోడవ్వడంతో దక్షిణాఫ్రికా కోలుకోలేకపోయింది. 10 పరుగుల వ్యవధిలో ఓపెనర్‌ మార్కరమ్‌ (39),ఫిలిండర్‌ (0, మహరాజ్‌ (0)లను జడేజా బోల్తా కొట్టించాడు. దీంతో సఫారీలు ఒక్కసారిగా పీకల్లోతు కష్టాల్లో పడ్డారు. అయితే ఒకే ఓవర్‌లో జడేజా మూడు వికెట్లు సాధించడం ఇక్కడ విశేషం. ఇక టీమిండియా విజయానికి 2 వికెట్లే. ఇంకా దక్షిణాఫ్రికా 291 పరుగుల వెనుకబడి ఉండటంతో భారత్‌ విజయం లాంఛనమే.

70 పరుగులకే 8 వికెట్లు:

70 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును సేనురాన్ ముత్తుసామి, డేన్ పీడ్ట్ ఆదుకునే ప్రయత్నం చేస్తునారు. ఈ జోడి ఇప్పటికే ధాటిగా ఆడుతూ 35 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా 37 ఓవర్లకు 104 పరుగులు చేసి ఎనమిది వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం సేనురాన్ ముత్తుసామి (14), డేన్ పీడ్ట్ (25) బ్యాటింగ్‌ చేస్తున్నారు.

జడేజా షాక్:

నాలుగో రోజు చివరలో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన దక్షిణాఫ్రికాకు ఆరంభంలోనే రవీంద్ర జడేజా షాకిచ్చాడు. దక్షిణాఫ్రికా జట్టు స్కోరు 4 పరుగుల వద్ద ఓపెనర్ ఓపెనర్ డీన్ ఎల్గర్ (4) రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. అంతకముందు దక్షిణాఫ్రికాకు టీమిండియా 395 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. రోహిత్‌ శర్మ (127: 149 బంతుల్లో 10ఫోర్లు, 7సిక్సర్లు) సెంచరీతో చెలరేగగా.. పుజారా (81: 148 బంతుల్లో 13ఫోర్తు, 2సిక్సర్లు) హాఫ్ సెంచరీతో రాణించాడు.

READ SOURCE