ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు: ట్విట్టర్‌లో బుమ్రా ట్వీట్

హైదరాబాద్: భారత క్రికెట్‌లో జస్ప్రీత్ బుమ్రా ప్రధాన పేసర్‌గా కొనసాగుతున్నాడు. గాయం కారణంగా దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌కు జస్ప్రీత్ బుమ్రా దూరం కావడంతో కోహ్లీసేనకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. భారత తరుపున ఇప్పటివరకు 12 టెస్టులాడిన బుమ్రా... సొంతగడ్డపై టెస్టు అరంగేట్రం కోసం ఎదురు చూస్తోన్న సమయంలో ఇది నిజంగా ఊహించని పరిణామం.

దక్షిణాఫ్రికాతో టెస్టు సిరిస్‌కు బుమ్రా దూరమయ్యాడనే వార్త రావడంతో అతడు త్వరగా కోలుకోవాలని భారత క్రికెట్ అభిమానులు అతడికి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు. అభిమానులు తనపై చూపించిన మద్దతుపై బుమ్రా తన ట్విట్టర్‌లో స్పందించాడు. త్వరగా కోలుకొని మరింత బలంగా పునరగామనం చేస్తానని చెప్పాడు.

గాయాలు అనేవి క్రీడల్లో సహజం

"గాయాలు అనేవి క్రీడల్లో సహజం. గాయం నుంచి త్వరగా కోలుకోవాలని విషెస్‌ చెప్పిన వారికి ధన్యవాదాలు. మీ ప్రేమాభిమానాలు​ నన్ను రెట్టింపు ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి. త్వరగానే మైదానంలోకి అడుగుపెడతా. ప్రస్తుతం నా లక్ష్యం తగిలిన ఎదురుదెబ్బ కన్నా నా పునరాగమనం త్వరగా, బలంగా ఉండాలని కోరుకుంటున్నాను" అంటూ ట్వీట్ చేశాడు.

ఒత్తిడి కారణంగా బుమ్రా వెన్నులో

ఒత్తిడి కారణంగా బుమ్రా వెన్నులో కింది వైపున చిన్న చీలిక వచ్చిందని, కొన్ని వారాల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు తేల్చడంతో బీసీసీఐ అతడి దక్షిణాఫ్రికాతో మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ నుంచి తప్పించారు. అతడి స్థానంలో ఉమేశ్‌ యాదవ్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా అక్టోబర్ 2న విశాఖపట్నం వేదికగా తొలి టెస్టు జరగనుంది.

డియాలజీ పరీక్షల సందర్భంగా

"ఆటగాళ్లకు చేసే సాధారణ రేడియాలజీ పరీక్షల సందర్భంగా బుమ్రాకు గాయం ఉన్నట్లు తేలింది. కోలుకునే వరకు బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో బుమ్రా వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఉంటాడు" అని బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. గతేడాది జనవరిలో దక్షిణాఫ్రికాపై అరంగేట్రం నుంచి బుమ్రా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌లలో 12 టెస్టులాడాడు.

బుమ్రా స్థానంలో ఉమేశ్ యాదవ్

ఇక, బుమ్రా స్థానంలో సఫారీ సిరిస్‌కు ఎంపికైన ఉమేశ్‌ యాదవ్ చివరగా గత డిసెంబర్లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో ఆడాడు. ఆ తర్వాత పేలవ ప్రదర్శనతో జట్టులో చోటు కోల్పోయాడు. విండిస్ పర్యటనకు ఎంపికైనాతుది జట్టులో ఆడే అవకాశం రాలేదు.

READ SOURCE