టాటా ఓపెన్ మహారాష్ట్ర: యుకి, రామ్‌కుమార్, అర్జున్‌లకు వైల్డ్ కార్డ్

హైదరాబాద్: ఏటీపీ 250 వరల్డ్ టూర్ టోర్నీలో భాగంగా ముగ్గురు భారత ఆటగాళ్లు యుకి బాంబ్రి, రామ్‌కుమార్ రామనాథన్, అర్జున్ ఖడెలకు టాటా ఓపెన్ మహారాష్ట్ర టోర్నీ సింగిల్స్ మెయిన్ డ్రాలో వైల్డ్‌కార్డ్ ద్వారా ఎంట్రీ కల్పించారు. ఈ మేరకు టోర్నీ నిర్వాహకులు శనివారం ప్రకటించారు.
డిసెంబర్ 30 నుంచి జనవరి 6 వరకు జరిగే ఈ టోర్నీ పూణెలోని ములుంగే బాల్వాడి స్టేడియంలో జరగనున్నాయి. యుకి బాంబ్రి ప్రస్తుతం దేశంలో అత్యుత్తమ సింగిల్స్ ర్యాంకు (116) ఆటగాడిగా కొనసాగుతున్నాడు. 25 ఏళ్ల యుకి ఈ ఏడాది అద్భుత ప్రదర్శన చేశాడు.
నవంబరులో జరిగిన కేపీఐటీ-ఎంఎస్‌ఎల్‌టీఏ ఛాలెంజర్ ఈవెంట్లో రామ్‌కుమార్‌ను ఓడించి విజేతగా నిలిచాడు. వాషింగ్టన్‌లో జరిగిన సిటీ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ వరకు వెళ్లాడు. క్వార్టర్స్‌లో చేరే క్రమంలో అతడు తనకంటే మెరుగైన ర్యాంకుని కలిగి ఉన్న గేల్ మోన్‌ఫిల్స్ (ఫ్రాన్స్)ను ఓడించాడు.
'ఈ ఏడాది నేను కొన్ని మంచి ఫలితాలు సాధించా. ఈ టోర్నీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా' అని యుకి డ్రా అనంతరం మీడియాతో అన్నాడు. ఇక, రామ్‌కుమార్ (142) కూడా ఈ ఏడాది చక్కటి ప్రదర్శన చేశాడు. ఇటీవలే అతడు మూడు ఐటీఎఫ్ ఫ్యూచర్స్ టైటిళ్లను కైవసం చేసుకున్నాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications