చైనాతో డేవిస్ కప్ పోటీకి యూకీ బాంబ్రీ దూరం

హైదరాబాద్: డేవిస్‌కప్‌లో భాగంగా వచ్చే నెలలో చైనాతో తలపడనున్న భారత టెన్నిస్ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. చైనాతో జరిగే ఆసియా ఓసియానియా గ్రూప్-1 డేవిస్ కప్ మ్యాచ్‌కు భారత నంబర్‌వన్ టెన్నిస్ ప్లేయర్, ఫామ్‌లో ఉన్న సింగిల్స్ ఆటగాడు యూకీ బాంబ్రీ దూరమయ్యాడు.
ఉదర సంబంధిత గాయం కారణంగా తాను ఈ నిర్ణయం తీసుకున్నానని యూకీ తెలిపాడు. యుకి స్థానంలో ప్రజ్నేష్‌ను డేవిస్‌కప్ జట్టులో ఎంపికచేసినట్లు సెలక్షన్ కమిటీ తెలిపింది. ఏప్రిల్ 6, 7 తేదీల్లో తియాన్‌జిన్ వేదికగా చైనాతో భారత్ తలపడనుంది. ముఖాముఖి రికార్డులో భారత్ 3-0తో ఆధిక్యంలో ఉంది.
గత రెండు వారాల్లో జరిగిన ఇండియన్ వెల్స్, మయామి మాస్టర్స్ సిరీస్ టోర్నీల్లో మెయిన్ 'డ్రా'లో ఆడిన యూకీ గైర్హాజరీ భారత జట్టు విజయావకాశాలను ప్రభావితం చేసే అవకాశముందని టెన్నిస్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Story first published: Tuesday, March 27, 2018, 11:51 [IST]
Other articles published on Mar 27, 2018
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications