Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అద్భుత టాలెంట్‌తో ఆకట్టుకుంటున్న బాలిక.. టెన్నిస్‌ బంతితో ఆడుతూనే!!

Young Girl Shows Off Tennis Skills While Doing Hula Hoops

ముంబై: ఏ ఆటైనా స‌రే ఆట‌గాడు ఆడుతున్నాడంటే క‌చ్చితంగా కంటికి, చేతికి మధ్య కోఆర్డినేష‌న్ చాలా అవ‌స‌రం. అప్ప‌డే ఓ ఆట‌గాడు ప‌రిపూర్ణ‌మైన షాట్ ఆడడానికి ఆస్కారం ఉంటుంది. అయితే దీంతో పాటు ఆట‌లో బ్యాలెన్సింగ్ కూడా చాలా ప్రాముఖ్య‌త ఉంటుంది. తాజాగా వుమెన్స్ టెన్నిస్ అసోసియేష‌న్ ‌(డ‌బ్ల్యూటీఏ) త‌న ట్విట‌ర్‌లో ఒక వీడియో షేర్ చేసింది. ఆ వీడియోలో ఒక అమ్మాయి టెన్నిస్ ప్రాక్టీస్ సంద‌ర్భంగా బ్యాలెన్సింగ్ ఎంత బాగా చేసిందనేది చూపించారు.

ఒకవైపు టెన్నిస్‌ రాకెట్‌తో బంతిని కొడుతూ.. అదే సమయంలో హులా హూప్స్‌ (శరీరంతో రింగును తిప్పడం) చేస్తూ అబ్బురపరుస్తోంది ఓ బాలిక. బాలిక తన కుడి చేతిలో రాకెట్ ప‌ట్టుకుని టెన్నిస్ బాల్‌తో ఆడుతూనే న‌డుముకు రింగ్ వేసుకొని బ్యాలెన్స్ చేసుకుంది. ఆడుతున్నంత సేపు త‌న ఏకాగ్ర‌త చెద‌ర‌నివ్వ‌డ‌మే కాకుండా ఒక్క‌సారి కూడా రింగ్ కింద‌కు ప‌డ‌నివ్వ‌లేదు. త‌ర్వాత అదే రింగ్‌ను చేతిలోకి తీసుకొని.. రాకెట్‌తో బాల్‌ను కొడుతూనే ఏక‌కాలంలో రింగ్‌ను బ్యాలెన్స్ చేసింది.

ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. వీడియోలోని బాలిక కుడిచేతితో టెన్నిస్‌ రాకెట్‌ పట్టుకుని బంతితో ఆడుతూనే.. మరోవైపు హులా హూప్స్‌ చేయడం అభిమానులను ఆకట్టుకుంటోంది. వీడియో చూసిన నెటిజన్లు తమదైన స్టయిల్లో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 'వావ్.. బాలిక సూపర్' అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. 'ఇప్పుడే ఇలా ఉందంటే.. పెద్దయ్యాక టెన్నిస్ ఆటను ఏలుతుంది' అని మరో అభిమాని కామెంట్ చేసాడు. 'రెండు పనులను ఒకేసారి చేయడానికి ఏకాగ్రత, నిరంతర అభ్యాసం, సహనం అవసరం. ఆమె నైపుణ్యాలు ప్రశంసనీయం' అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

డ‌బ్ల్యూటీఏ ట్విట‌ర్‌లో స్పందిస్తూ.. 'ఈ అమ్మాయి టెన్నిస్ ఆడుతూనే రింగ్‌ను చక్క‌గా బ్యాలెన్స్ చేసింది. కంటికి చేతికి మ‌ధ్య స‌మ‌న్వ‌యం ఏర్ప‌రచుకుంటునే ఏకాగ్ర‌త కోల్పోకుండా ఆడింది. ఇదంతా చేయాలంటే ఏకాగ్ర‌త, ప్రాక్టీస్‌తో పాటు ఓపిక కూడా ఎంతో అవ‌స‌రం. ఈ అమ్మాయి అవ‌న్నీ ఎప్పుడో సాధించేసిందంటూ' క్యాప్ష‌న్ జ‌త చేసింది.

Story first published: Friday, April 24, 2020, 14:46 [IST]
Other articles published on Apr 24, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+