Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫ్రెంచ్ టెన్నిస్ స్టార్‌కు గుండె కదిలించే లెటర్ రాసిన బాల్‌గర్ల్

హైదరాబాద్: ఫ్రెంచి టెన్నిస్‌ దిగ్గజం సోంగా చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ ట్వీట్‌లో ఏముందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. గతేడాది సోంగా ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ రెండో రౌండ్‌ మ్యాచ్‌ అడుతుండగా గిలియానా అనే బాల్‌ గర్ల్‌ (బాల్‌కిడ్‌) కంటతడి పెట్టడం గమనించాడు.

వెంటనే ఆటను ఆపివేసి బాలిక వద్దకు వెళ్లాడు. బంతి తగిలి బాలిక గాయపడినట్లు తెలుసుకున్న సోంగా, ఆమెను అక్కున చేర్చుకుని సముదాయించాడు. అంతేకాదు బాలికను కోర్టు బయటకు తీసుకెళ్లి వైద్య సాయం చేయాల్సిందిగా నిర్వాహకులకు సూచించాడు.

Young ballgirl sends heartwarming letter to tennis star

అనంతరం ఆటను కొనసాగించాడు. అయితే ఈ విషయాన్ని అంతటితో సోంగా మరిచిపోయాడు. కొన్నాళ్లకు ఆ బాల్ గర్ల్ తనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ పంపించిన ఓ ఉత్తరాన్ని తన ట్వీట్టర్‌లో పోస్టు చేశాడు. ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్‌ అవుతోంది.

''డియర్ మిస్టర్‌ జో విల్ఫ్రెడో సోంగా
నేను మీకు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. నేను గుర్తుండకపోవచ్చు. గత ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో మీ రెండోరౌండ్‌ మ్యాచ్‌ సందర్భంగా గాయపడిన ఓ బాల్‌గర్ల్‌కు మీరు సాయం చేశారు. ఆమెను నేనే.
ఓ విషయానికి నేను మీకు క్షమాపణ చెప్తున్నాను. అప్పట్లో మీరు బంతి అడిగిన వెంటనే అందించలేకపోయాను. వైరల్‌ ఫీవర్‌ కారణంగా ఆరోజు నా పరిస్థితి బాగోలేదు. మీరు బంతి అడిగిన విషయాన్ని కూడా గుర్తించలేకపోయాను. అప్పుడు నాకు ఏమీ కన్పించలేదు. వినిపించలేదు. అత్యున్నత స్థాయి మ్యాచ్‌లో బాల్‌గర్ల్‌గా నా విధులు సరిగా నిర్వహించలేనందుకు నన్ను క్షమించండి.
మీరు ఆ సమయంలో నాపై చూపిన దయకు కృతజ్ఞతలు చెబుతున్నాను. నాకు ఆ సమయంలో మనిషి అవసరం అని గుర్తించి కోర్టు బయటకు వెళ్లేందుకు సాయం చేసినందుకు అభినందిస్తున్నాను.
తదుపరి రౌండ్‌లోకి వెళ్లినందుకు శుభాకాంక్షలు. మీ తర్వాతి మ్యాచ్‌లకు ఆల్‌ది బెస్ట్‌ చెబుతున్నాను.
థ్యాంక్యూ,
గిలియాన - ఏవో బాల్‌కిడ్‌ నెం: 180''.

Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+