
హైదరాబాద్: కరోలినా వొజ్నియాకి గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను సాధించింది. శనివారం సైమన్ హలెప్ తో హోరాహోరీగా తలపడి 7-6 (7-2), 3-6, 6-4 స్కోరుతో విజయం సాధించింది.
11 ఏళ్లు.. 43 గ్రాండ్‌స్లామ్ టోర్నీలు.. విమర్శలు.. గాయాలు.. కన్నీళ్లు..! చివరికి ఆమె కల తీరింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ రూపంలో గ్రాండ్‌స్లామ్ టైటిల్ కరోలినా ఖాతాలో చేరింది. శనివారం హోరాహోరీ సాగిన జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో రెండో సీడ్ వోజ్నియాకి 7-6 (7-2), 3-6, 6-4తో టాప్‌సీడ్ హలెప్ (రుమేనియా)ను ఓడించింది.
తొలి సెట్లో మొదట్లోనే హలెప్ సర్వీస్ బ్రేక్ చేసిన వోజ్నియాకి 3-0తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. ఒక దశలో ఆమె 5-3తో సెట్ గెలవడానికి సిద్ధమైంది. ఈ స్థితిలో వోజ్నియాకి సర్వీసు బ్రేక్ చేసిన హలెప్.. ఆ తర్వాత తన సర్వీసు నిలబెట్టుకుని 5-5తో స్కోరు సమం చేయడమే కాక.. సెట్‌ను టైబ్రేకర్‌కు మళ్లించింది. టైబ్రేకర్‌లో సర్వీసులతో ఆకట్టుకున్న వోజ్నియాకి.. 7-6 (7-2)తో సెట్‌ను గెలుచుకుంది. రెండో సెట్ ఆరంభంలో నాలుగు బ్రేక్ పాయింట్లు కాచుకున్న హలెప్.. ఆ తర్వాత ప్రత్యర్థి సర్వీసు బ్రేక్ చేసి 6-3తో సెట్ గెలిచి మ్యాచ్‌లో నిలిచింది. అయితే ఈ సెట్ జరుగుతుండగా హలెప్ అస్వస్థతకు గురైంది. కోర్టులో కుంటుతూ కూలబడిపోయింది.
కోర్టులో కుంటుతూ కూలబడిపోయింది. వైద్య విరామం తర్వాత ఆమె మ్యాచ్‌ను కొనసాగించింది. మూడో సెట్ రెండో గేమ్‌లోనే ప్రత్యర్థి సర్వీస్ బ్రేక్ చేసిన వోజ్నియాకి 2-1తో ఆధిక్యంలో నిలిచింది. అయితే హలెప్ పుంజుకుని వోజ్నియాకి సర్వీసు బ్రేక్ చేసి 3-3తో స్కోరు సమం చేసింది. ఆ తర్వాత ఇద్దరు సర్వీసు నిలబెట్టుకుంటూ ముందుకెళ్లడంతో ఒక దశలో వోజ్నియాకి 5-4తో నిలిచింది. మ్యాచ్‌లో ఆశలు ఉండాలంటే హలెప్‌కు కచ్చితంగా సర్వీస్ నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.