తప్పు ఒప్పుకున్న వరల్డ్ నెం.1 ప్లేయర్!.. ఆస్ట్రేలియా ఓపెన్ విజేతపై నిషేధం
గతనెలలోనే ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా నిలిచిన వరల్డ్ నెం.1 నంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్ జనిక్ సినర్ పై ఎట్టకేలకు నిషేధం విధించారు. గతేడాది నుంచి డోపింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న అతడు తాజాగా తనపై వేసిన శిక్షను అంగీకరించాడు. ప్రస్తుతం ఈ విషయం టెన్నిస్ ప్రపంచంలో తీవ్ర చర్చకు దారీ తీసింది.
అసలు ఏం జరిగిందంటే
గతేడాది జనిక్ సినర్.. నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్లు డోపింగ్ ఆరోపణలు వచ్చాయి. కానీ అప్పుడతడు టెస్టులో పాజిటివ్ వచ్చినప్పటికీ తప్పించుకున్నాడు. ఇది తనకు తెలియకుండానే జరిగినట్లు సినర్ చెప్పడంతో.. అంతర్జాతీయ టెన్నిస్ ఇంటెగ్రిటీ ఏజెన్సీ (ITIA) అతడిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అలానే అతడిపై నిషేధం కూడా విధించలేదు. అయితే ఇది విమర్శలకు దారీ తీసింది. టెన్నిస్ స్టార్ నిక్ కిర్గియోస్.. సినర్ పై చర్యలు తీసుకోకపోవడాన్ని ఖండించాడు. ఆటగాళ్ల స్థాయి ఆధారంగా నిర్ణయాలు మారుతున్నాయి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇదే సమయంలో ITIA తీరుపై... కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ లో (CAS) అప్పీలు చేశారు.

ఈ క్రమంలోనే సినర్.. వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (వాడా)తో సెటిల్ మెంట్ కు వచ్చాడు. దీంతో తనపై మూడు నెలల పాటు నిషేధం విధించారు. ఆ శిక్షను సినర్ కూడా అంగీకరించాడు. గతవారమే ఈ నిషేధం అమల్లోకి వచ్చింది. ఫిబ్రవరి 9 నుంచి మార్చి 4 వరకు సినర్ పై నిషేధం విధించారు. కాగా, ఫ్రెంచ్ ఓపెన్ 2025 మే 25 నుంచి మొదలు కానుండగా.. ఈ లోగా తన నిషేధాన్ని పూర్తి చేసుకుని ఫ్రెంచ్ ఓపెన్ బరిలోకి దిగుతాడు సినర్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications