న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డబ్ల్యూటీఏ ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డు సొంతం చేసుకున్న ఆష్లే బార్టీ

 World No. 1 Ashleigh Barty Wins WTA Player Of The Year Award

హైదరాబాద్: ఈ ఏడాది ఫ్రెంచ్‌ ఓపెన్‌తో పాటు టెన్నిస్‌ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచిన ఆస్ట్రేలియన్ టెన్నిస్ ప్లేయర్ ఆష్లే బార్టీ 2019 సంవత్సరానికి గాను మహిళల టెన్నిస్‌ సంఘం (డబ్ల్యూటీఏ) 'ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌' అవార్డుని సొంతం చేసుకుంది.

ఈ ఏడాది గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ గెలిచిన నయోమి ఒసాకా (జపాన్‌-ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ విజేత), సిమోనా హలెప్‌ (రొమేనియా-వింబుల్డన్‌ విజేత), బియాంక ఆండ్రెస్కూ (కెనడా-యూఎస్‌ ఓపెన్‌ విజేత) ఈ అవార్డు కోసం పోటీపడినప్పటికీ 82 శాతం మీడియా ఓట్లతో బార్టీ ఈ అవార్డుని అందుకుంది.

<strong>థాయ్‌లాండ్‌లో యువరాజ్‌ సందడి.. సచిన్‌, హర్భజన్‌తో బర్త్‌డే వేడుకలు!!</strong>థాయ్‌లాండ్‌లో యువరాజ్‌ సందడి.. సచిన్‌, హర్భజన్‌తో బర్త్‌డే వేడుకలు!!

ఇవోని గూలాగాంగ్‌ (1976) తర్వాత నంబర్‌వన్‌ ర్యాంకును సొంతం చేసుకున్న తొలి ఆస్ట్రేలియా క్రీడాకారిణిగా బార్టీ అరుదైన ఘనత సాధించింది. ఈ ఏడాది మొత్తం నాలుగు టైటిళ్లను గెలిచిన బార్టీ డబ్ల్యూటీఏ ఫైనల్స్ విజేతగా కూడా నిలిచింది. ఈ టూర్‌లో భాగంగా బార్టీ 57 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.

ఫలితంగా 2000 పాయింట్లతో బార్టీ ఈ ఏడాదిని ముగించింది. ఆమె కోచ్‌ క్రెయిగ్‌ టైజెర్‌ 'డబ్ల్యూటీఏ కోచ్‌ ఆఫ్‌ ద ఇయర్‌' అవార్డుని అందుకున్నాడు. కెనడాకు చెందిన 19 ఏళ్ల ఆండ్రెస్కు న్యూ కమర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని గెలుచుకుంది. ఈ ఏడాది యుఎస్ ఓపెన్ టైటిల్‌ని బియాంక ఆండ్రెస్కూ గెలుచుకున్న సంగతి తెలిసిందే.

Story first published: Friday, December 13, 2019, 12:05 [IST]
Other articles published on Dec 13, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X