హైదరాబాద్: తన అకాడమీ ద్వారా దేశానికి మంచి టెన్నిస్ క్రీడాకారులను ఇవ్వాలన్నదే తన కోరికని భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జా చెప్పారు. మంగళవారం మొయినాబాద్‌లోని సానియా మిర్జా టెన్నిస్ అకాడెమీలో డబ్ల్యూటిఏ ప్యూచర్ స్టార్స్ టెన్నిస్ మాస్టర్ క్లాస్ ప్రారంభోత్సవం జరిగింది.
ఈ సందర్భంగా సానియా మిర్జా మాట్లాడుతూ మన దేశంలో మహిళల టెన్నిస్‌కు ప్రాధాన్యత పెరుగుతోందనీ, అందరినీ ఒకే రకంగా చూడాలని సూచించారు. తన అకాడమీ ద్వారా దేశానికి మంచి టెన్నిస్ క్రీడాకారులను ఇవ్వాలన్నది తన కోరిక అని ఈ సందర్భంగా చెప్పారు.

లార్డ్స్ వేదికగా జరిగిన మహిళల వరల్డ్ కప్ పైనల్లో భారత మహిళల జట్టు అద్భుత ప్రదర్శన చేసిందని ప్రశంసలు కురిపించింది. దేశంలో మహిళా క్రీడాకారులు తమ తమ రంగాల్లో అద్భుత ప్రదర్శన చేస్తున్నారని, వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరే వరకు భారత మహిళల జట్టుకి సరైన మద్దతు లభించలేదని తెలిపింది.
అనంతరం సానియా మిర్జా, బాలీవుడ్ హీరోయిన్ నేహా ధూపియా డ్యాన్స్‌లతో అదరగొట్టారు. అకాడమీలోని చిన్నారులతో కలిసి డ్యాన్స్ చేశారు. డబ్ల్యూటిఏ ప్యూచర్ స్టార్స్ టెన్నిస్ మాస్టర్ క్లాస్ ప్రారంభోత్సవం సందర్భంగా పలువురు చిన్నారులకు టెన్నిస్ మెళకువలు నేర్పించింది.