తెలంగాణ ప్రోత్సాహం మరువలేను: సానియా(పిక్చర్స్)
హైదరాబాద్: తనకు తెలంగాణ ప్రభుత్వం నుంచి అందిన ప్రోత్సాహాన్ని ఎన్నటికీ మరువలేనని భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా అన్నారు. తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించిన తర్వాత తనలో ఆత్మవిశ్వాసం మరింత పెరిగిందని చెప్పారు.
ఫలితంగా గతంలో ఎన్నడూ లేనంతగా అత్యున్నత విజయాలను అందుకోగలిగానని వివరించారు. తన విజయాల జోరు ఇకముందూ కొనసాగుతుందని టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా తెలిపారు.
విశ్వక్రీడల్లో దేశానికి ప్రాతినిథ్యం వహించడమనేది అరుదైన గౌరమని.. ఇప్పటికే కొన్ని ఒలింపిక్స్‌లో పోటీపడ్డట్లు తెలిపారు. ఇప్పుడున్న ఫామ్‌ను కొనసాగిస్తూ వచ్చే ఏడాది రియో ఒలింపిక్స్‌లో దేశానికి పతకం తీసుకురావాలనుకుంటున్నట్లు చెప్పారు. అందుకు తన సత్తామేరకు ఖచ్చితంగా కృషి చేస్తానని తెలిపారు.
లియాండర్ పేస్, మహేశ్ భూపతి, సానియాలతోనే భారత టెన్నిస్ ఆగిపోకూడదని అన్నారు. భవిష్యత్‌లో ఇక్కడినుంచి అగ్రస్థానాన్ని అందుకునేందుకు మరింతమంది క్రీడాకారులు వెలుగులోకి రావాలని ఆకాంక్షించారు.
అయితే అంతకంటే ముందు, మన టెన్నిస్ విధానంలో చాలా మార్పురావాలని అన్నారు. క్రికెట్ తరహాలో టెన్నిస్‌కు ఒక కొత్త కళను తీసుకొచ్చి మరింత మంది ఈ ఆటవైపు ఆకర్షితులయ్యేలా చేయగలగాలని చెప్పారు. అందుకుగాను, మహేశ్ భూపతి, తాను వీలైనంతగా కృషి చేస్తున్నామని తెలిపారు.

ట్రోఫీతో సానియా
తనకు తెలంగాణ ప్రభుత్వం నుంచి అందిన ప్రోత్సాహాన్ని ఎన్నటికీ మరువలేనని భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా అన్నారు.

సానియా
తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించిన తర్వాత తనలో ఆత్మవిశ్వాసం మరింత పెరిగిందని చెప్పారు.

సానియా
ఫలితంగా గతంలో ఎన్నడూ లేనంతగా అత్యున్నత విజయాలను అందుకోగలిగానని వివరించారు. తన విజయాల జోరు ఇకముందూ కొనసాగుతుందని టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా తెలిపారు.

సానియా
విశ్వక్రీడల్లో దేశానికి ప్రాతినిథ్యం వహించడమనేది అరుదైన గౌరమని.. ఇప్పటికే కొన్ని ఒలింపిక్స్‌లో పోటీపడ్డట్లు తెలిపారు. ఇప్పుడున్న ఫామ్‌ను కొనసాగిస్తూ వచ్చే ఏడాది రియో ఒలింపిక్స్‌లో దేశానికి పతకం తీసుకురావాలనుకుంటున్నట్లు చెప్పారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications