Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అసలేం జరిగింది?: ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఏడ్చిన వీనస్ విలియమ్స్

హైదరాబాద్: ప్రతిష్టాత్మక వింబుల్డన్ టోర్నీ సోమవారం ఆరంభమైన సంగతి తెలిసిందే. తొలి రోజు ఎటువంటి సంచలనాలు లేకుండా సాఫీగా సాగిపోయింది. పురుషుల సింగిల్స్‌లో టాప్‌సీడ్‌ ఆండీ మర్రే, నాలుగో సీడ్‌ రఫెల్‌ నాదల్‌ రెండో రౌండ్‌లోకి అడుగుపెట్టారు.

ఇక మహిళల సింగిల్స్‌లో మాజీ చాంపియన్‌ పెట్రా క్విటోవా (చెక్‌ రిపబ్లిక్‌), రెండో సీడ్‌ హలెప్‌ (రొమేనియా), నాలుగో సీడ్‌ స్వితోలినా (ఉక్రెయిన్‌), పదో సీడ్‌ వీనస్‌ విలియమ్స్‌ (అమెరికా) రెండో రౌండ్‌లోకి అడుగు పెట్టారు. రికార్డు స్ధాయిలో 20వ సారి వింబుల్డన్ ఆడుతున్న వీనస్ విలియమ్స్ తొలి రౌండ్‌లో ఆరంభంలో తడబడింది.

37 ఏళ్ల వీనస్ విలియమ్స్ తొలి రౌండ్‌లో 7-6(9/7), 6-4తో ఎలిసె మెర్టన్స్ (బెల్జియం)పై అతి కష్టం మీద విజయం సాధించింది. తొలి రౌండ్‌లో మెర్టన్స్‌పై గెలిచాక మీడియా సమావేశానికి హాజరైన మాజీ చాంపియన్‌ వీనస్‌ విలియమ్స్ కన్నీళ్ల పర్యంతమైంది.

జూన్‌ 9న ఫ్లోరిడాలో వీనస్‌ విలియమ్స్ డ్రైవ్‌ చేస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ రోడ్డు ప్రమాదంలో గాయపడిన జెరోమ్ బార్సన్ (79) అనే వృద్ధుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రెండు వారాల తర్వాత మృతి చెందాడు.

ఈ సంఘటనకు సంబంధించి వీనస్‌ను మీడియా ప్రశ్నించగా ఆమె కన్నీటి పర్యంతమైంది 'ఆ సంఘటనపై స్పందించేందుకు నా నోట మాటలు రావడంలేదు. ఆట మాత్రమే నా చేతుల్లో ఉంటుంది. జీవితంలో రేపు ఏం జరుగుతుందో చెప్పలేను' అని వీనస్‌ వ్యాఖ్యానించింది.

వీనస్‌పై ఎలాంటి అభియోగాలు నమోదు చేయలేదు

వీనస్‌పై ఎలాంటి అభియోగాలు నమోదు చేయలేదు

ఈ సంఘటనలో ఇప్పటి వరకు వీనస్‌పై ఎలాంటి అభియోగాలు నమోదు కాలేదు. ఆమె కావాలని ఈ యాక్సిడెంట్ జరపకపోయినా, ఆమె కారణంగా యాక్సిడెంట్ జరిగిందని పోలీసులు చెబుతుండడంతో ఆమె కెరీర్‌పై ఇది ప్రభావం చూపే అవకాశం ఉంటుందని అంటున్నారు.

జూన్‌ 9న ఫ్లోరిడాలో ఏం జరిగింది?

జూన్‌ 9న ఫ్లోరిడాలో ఏం జరిగింది?

వీనస్‌ విలియమ్స్‌ నడుపుతున్న కారు ప్రమాదవశాత్తూ మరో కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 79 ఏళ్ల వృద్ధుడు జెరోమ్‌ బార్సన్‌ తీవ్రంగా గాయపడ్డాడు. కారు నడుపుతున్న జెరోమ్‌ భార్య లిండా బార్సన్‌ కూడా గాయపడటంతో స్థానికులు వారిద్దరిని ఆసుపత్రికి తరలించారు. తలకు తీవ్ర గాయమైన జెరోమ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 14 రోజుల తర్వాత మరణించాడు.

వీనస్ పాత్రపై పోలీసులు

వీనస్ పాత్రపై పోలీసులు

దీంతో పామ్ బీచ్ గార్డెన్ సిగ్నల్ వద్ద వేచి చూస్తుండగా, నిబంధనలు ఉల్లంఘించి, వీనస్ కారుతో ఢీ కొట్టిందని జెరోమ్ బార్సన్ భార్య లిండా బార్సన్ తెలిపారు. పోలీసులు దీనిపై విచారణ చేపట్టారు. కారు నడుపుతున్న సమయంలో వీనస్ విలియమ్స్ ఫోన్‌ మాట్లాడటం, డ్రగ్స్‌, ఆల్కహాల్‌ లాంటివి తీసుకోలేదని పోలీసులు తెలిపారు.

వీనస్‌ ప్రగాఢ సానుభూతి

వీనస్‌ ప్రగాఢ సానుభూతి

ట్రాఫిక్‌ ఎక్కువగా ఉండటం వల్ల ఎదురుగా ఉన్న లిండా బార్సన్ కారును చూడలేకపోయానని వీనస్‌ తెలిపిందని పోలీసులు చెప్పారు. ఈ ప్రమాదంలో జెరోమ్‌ ప్రాణాలు కోల్పోయాడని, ఆయన మృతికి వీనస్‌ ప్రగాఢ సానుభూతి తెలిపిందని వీనస్‌ అటార్నీ మాల్కమ్‌ తెలిపారు. విచారణ ఇంకా కొనసాగుతోందని ఆయన అన్నారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+