Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వింబుల్డన్‌లో సంచలనం: షరపోవా ఇలా తొలిసారి, ఫెదరర్ ముందుకు

Wimbledon: Ruthless Federer marches on, Serena sails past Tomova; second seed Wozniacki bows out

హైదరాబాద్: వింబుల్డన్ టోర్నీలో బుధవారం మహిళల సింగిల్స్‌లో సంచలన ఫలితాలు నమోదయ్యాయి. డోపింగ్‌ నిషేధం తర్వాత పునరాగమనంలో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న వింబుల్డన్ మాజీ చాంపియన్‌ మరియా షరపోవా తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. రష్యాకే చెందిన విటాలియా దియాచెన్‌కో 6-7(3), 7-6(3), 6-4తో 25వ సీడ్‌ షరపోవాను చిత్తుగా ఓడించింది.

షరపోవా ఇలా వెనుదిరగడం ఇదే తొలిసారి

షరపోవా ఇలా వెనుదిరగడం ఇదే తొలిసారి

షరపోవా.. గ్రాస్‌కోర్టు ఓ గ్రాండ్‌స్లామ్‌లో ఇలా ఆరంభంలోనే వెనుదిరగడం ఇదే తొలిసారి. ఇక, రెండో సీడ్‌ వొజ్నియాకి (డెన్మార్క్‌), మాజీ నంబర్‌వన్‌ అజరెంకా (బెలారస్‌), మాజీ రన్నరప్‌ రద్వాన్‌స్కా (పోలాండ్‌) రెండో రౌండ్‌లో ఇంటిముఖం పట్టారు. రెండోరౌండ్లో వోజ్నియా(డెన్మార్క్‌)కి 4-6, 6-1, 5-7తో రష్యా భామ మకరోవా చేతిలో ఓడింది.

 రెండో రౌండ్‌లో అజరెంకా ఓటమి

రెండో రౌండ్‌లో అజరెంకా ఓటమి

ఇక, అజరెంకా 3-6, 3-6తో ఏడో సీడ్‌ ప్లిస్కోవా చేతిలో పరాజయం చవిచూసింది. రద్వాంస్కా 5-6, 4-6తో సఫరోవా చేతిలో ఓడింది. మరోవైపు ‘విలియమ్స్‌ సిస్టర్స్‌' సెరెనా, వీనస్‌ మూడో రౌండ్‌లోకి ప్రవేశించారు. రెండో రౌండ్‌లో సెరెనా 6-1, 6-4తో విక్టోరియా తొమోవా (బల్గేరియా)పై, వీనస్‌ 4-6, 6-0, 6-1తో అలెగ్జాండ్రా డల్గెరూ (రొమేనియా)పై విజయం సాధించారు.

మూడో రౌండ్‌లోకి రోజర్ ఫెదరర్

మూడో రౌండ్‌లోకి రోజర్ ఫెదరర్

రికార్డుస్థాయిలో తొమ్మిదో వింబుల్డన్‌ సింగిల్స్‌ టైటిల్‌పై గురి పెట్టిన స్విస్ టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌ ఆ దిశగా మరో అడుగు ముందుకేశాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఫెదరర్‌ 89 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో 6-4, 6-4, 6-1తో లుకాస్‌ లాకో (స్లొవేకియా)పై గెలిచాడు. ఈ మ్యాచ్‌లో ఫెదరర్‌ ఏకంగా 48 విన్నర్లు, 16 ఏస్‌లు సంధించి ప్రత్యర్థిని హడలెత్తించాడు.

స్ట్రఫ్‌‌పై ఇవో కార్లోవిచ్‌ విజయం

స్ట్రఫ్‌‌పై ఇవో కార్లోవిచ్‌ విజయం

శుక్రవారం జరిగే మూడో రౌండ్‌లో జాన్‌ లెనార్డ్‌ స్ట్రఫ్‌ (జర్మనీ)తో ఫెదరర్ తలపడనున్నాడు. కాగా, ఇవో కార్లోవిచ్‌ (క్రొయేషియా)తో 3 గంటల 54 నిమిషాలపాటు జరిగిన రెండో రౌండ్‌ మ్యాచ్‌లో స్ట్రఫ్‌ 6-7 (3/7), 3-6, 7-6 (7/4), 7-6 (7/4), 13-11తో గెలుపొందాడు. ఈ మ్యాచ్‌లో కార్లోవిచ్‌ ఏకంగా 61 ఏస్‌లు సంధించడం విశేషం.

భారత ఆటగాడు పురవ్‌ రాజాకు నిరాశ

భారత ఆటగాడు పురవ్‌ రాజాకు నిరాశ

మిగతా మ్యాచ్‌ల్లో 13వ సీడ్‌ రోనిచ్‌ 7-6 (7-4), 7-6 (7-4), 7-6 (7-4)తో మిల్‌మన్‌పై నెగ్గాడు. మోన్‌ఫిల్స్‌, సామ్‌ క్వెరీ కూడా మూడో రౌండ్‌కు చేరారు. పురుషుల డబుల్స్‌లో భారత ఆటగాడు పురవ్‌ రాజాకు నిరాశ ఎదురైంది. డబుల్స్‌ తొలిరౌండ్లో పురవ్‌ రాజా-ఫాబ్రిస్‌ మార్టిన్‌ (ఫ్రాన్స్‌) జోడీ 2-4, 4-6, 7-6(5), 6-4, 9-11తో మీర్జా బాసిచ్‌-డుసాన్‌ లజోవిచ్‌ జంట చేతిలో పోరాడి ఓడింది.

Story first published: Thursday, July 5, 2018, 10:39 [IST]
Other articles published on Jul 5, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+