వింబుల్డన్: ఫెదరర్ జోరు, 50వ సారి క్వార్టర్ ఫైనల్లో
హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న వింబుల్డన్ టోర్నీలో ఏడుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన రోజర్ ఫెదరర్ (న్యూజిలాండ్) దూసుకుపోతున్నాడు. మూడో సీడ్‌గా బరిలోకి దిగిన ఫెదరర్ ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ఫెదరర్ 6-4, 6-2, 6-4తో 13వ సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా)పై విజయం సాధించాడు.
35 ఏళ్ల ఫెదరర్ దిమిత్రోవ్‌పై విజయం సాధించడం ఇది ఆరోసారి. ఏడు సార్లు వింబుల్డన్ ఛాంపియన్‌గా నిలిచిన రోజర్ ఫెదరర్ తన కెరీర్‌లో 19వ గ్లాండ్ స్లామ్ టైటిల్‌కు చేరువయ్యాడు. క్వార్టర్ ఫైనల్లో కెనడాకు చెందిన మిలోస్ రోనిక్‌తో తలపడనున్నాడు.
ఇదిలా ఉంటే గ్రాండ్ స్లామ్ టోర్నీల్లో ఫెదరర్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకోవడం ఇది 50వ సారి కావడం విశేషం. ఇదిలా ఉంటే ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో 11వ సీడ్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్) 6-3, 6-7 (1/7), 6-3, 3-6, 6-3తో 8వ సీడ్ థీమ్ (ఆస్ట్రియా)పై విజయం సాధించారు.
ఏడో సీడ్ సిలిచ్ (క్రొయేషియా) 6-2, 6-2, 6-2తో 18వ సీడ్ అగుట్ (స్పెయిన్)పై, 24వ సీడ్ సామ్ క్వెరీ (అమెరికా) 5-7, 7-6 (7/5), 6-3, 6-7 (11/13), 6-3తో అండర్సన్ (దక్షిణాఫ్రికా)పై గెలిచారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications