వింబుల్డన్: 850వ విజయాన్ని సొంతం చేసుకున్న నాదల్
హైదరాబాద్: ప్రతిష్టాత్మక వింబుల్డన్ టోర్నీలో స్పెయిన్‌కు చెందిన రఫెల్ నాదల్ అరుదైన ఘనత సాధించాడు. సోమవారం ప్రారంభమైన ఈ టోర్నీలో తొలి రౌండ్లో నాలుగో సీడ్ రఫెల్ నాదల్ 6-1, 6-3, 6-2 స్కోరుతో వరుస సెట్లలో ఆస్ట్రేలియాకు చెందిన అన్‌సీడెడ్ మిల్‌మాన్‌ను చిత్తు చేశాడు.
దీంతో నాదల్ టెన్నిస్ చరిత్రలోనే ఓ అరుదైన ఘనత సాధించాడు. ఈ విజయం నాదల్‌కు 850వ విజయం కావడం విశేషం. టెన్నిస్ ఆటగాళ్లు ఫెదరర్, జిమ్మీ కానర్స్ తదితరుల తర్వాత ఈ అరుదైన ఘనత సాధించిన ఏడో ఆటగాడిగా నాదల్ రికార్డు సృష్టించాడు.
అంతేకాదు గ్రాండ్‌స్లామ్‌లో 217 విజయాలతో మేజర్ టోర్నీల్లో అత్యధిక విజయాలు అందుకున్న ఆటగాళ్ల జాబితాలో ఆరో ప్లేయర్‌గా చోటు దక్కించుకున్నాడు. ఇటీవలే రికార్డు స్థాయిలో పదో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గి ఊపు మీదున్న నాదల్ గత రెండేళ్లుగా గ్రాస్ కోర్టులో ఆడలేదు.
గాయం కారణంగా గతేడాది వింబుల్డన్ టోర్నీకి కూడా దూరమయ్యాడు. ఈ మ్యాచ్ అనంతరం నాదల్ మాట్లాడాడు. 'గాయం నుంచి కోలుకుని తిరిగి ఆటలోకి రావడం ఎంతో ఆనందంగా ఉంది. వింబుల్డన్ ద్వారా ఈ సీజన్ ప్రారంభించడం సంతోషంగా ఉంది. బాగా ఆడి విజయం సాధించాలన్న భావనతో కోర్టులో అడుగుపెట్టా. నా ఫోర్ హ్యాండ్ షాట్ల పట్ల సంతృప్తికరంగా ఉన్నా' అని చెప్పాడు.
కాగా వింబుల్డన్ టోర్నీ రెండో రౌండ్లో నాదల్ ఆస్ట్రేలియాకు చెందిన డొనాల్డ్ యంగ్‌తో తలపడనున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications