For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వింబుల్డన్: రోజర్ ఫెదరర్‌కు షాక్, జోకవిచ్‌ విజేత

By Pratap

లండన్‌: ఎనిమిదోసారి చాంపియన్‌గా నిలవాలన్న ఫెడరర్‌ స్వప్నం నెరవేరలేదు.. టాప్‌ సీడ్‌ నొవాక్‌ జొకోవిచ్‌ రెండోసారి వింబుల్డన్‌ చాంపియన్‌గా అవతరించాడు. ఆదివారమిక్కడ జరిగిన టైటిల్‌ ఫైట్‌లో వరల్డ్‌ నెంబర్‌వన్‌ జొకోవిచ్‌ 6-7 (7), 6-4, 7-6 (4), 5-7, 6-4తో నాలుగో సీడ్‌ ఫెడరర్‌పై ఐదు సెట్లలో పోరాడి నెగ్గాడు. వింబుల్డన్‌లో నొవాక్‌కిది రెండో టైటిల్‌ కాగా, కెరీర్‌లో ఏడో గ్రాం డ్‌స్లామ్‌.

వింబుల్డన్‌లో 8 టైటిళ్లు నెగ్గి ఓపెన్‌ ఎరాలో పీట్‌ సం ప్రాస్‌ రికార్డును బ్రేక్‌ చేయాలని చూసిన ఫెడరర్‌కు భంగపాటు తప్పలేదు. ఇక నడాల్‌ (ఫ్రెంచ్‌ ఓపెన్‌) తర్వాత ఒకే గ్రాండ్‌స్లామ్‌ను ఎనిమిది సార్లు నెగ్గిన రెండో ఆటగాడిగా రికార్డుకెక్కాలన్న కల కూడా నెరవేరలేదు.

ఇరువురి మద్య హోరాహోరీ పోరు జరిగింది. తొలి సెట్‌లో జొకోవిచ్‌, ఫెడరర్‌ ఇద్దరూ ఎవరి సర్వీస్‌లు వాళ్లు నిలబెట్టుకోవడంతో టై బ్రేకర్‌ అనివార్యమైంది. అయితే టై బ్రేకర్స్‌లో అమోఘమైన రికార్డున్న ఫెడరర్‌ తన అనుభవాన్నంతా ఉపయోగించి 9-7తో నెగ్గాడు. దీంతో తొలిసెట్‌ స్విస్‌ కెరటం సొంతమైంది. అయితే రెండో సెట్‌లో జొకోవిచ్‌ విజృంభించాడు.

Wimbledon: Novak Djokovic beats Federer final

మూడో గేమ్‌లో ఫెడెక్స్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసి ఆ తర్వాతి గేమ్‌ను కూడా నెగ్గి 3-0తో ఆధిక్యం సాధించాడు. అదే ఊపులో 6-4తో ఆ సెట్‌ను సొంతం చేసుకున్నాడు. మూడో సెట్‌ కూడా నవ్వా నేనా అన్నట్టు సాగింది. ఇరువురూ సర్వీస్‌లు నిలబెట్టుకోవడంతో మరో టై బ్రేకర్‌ తప్పలేదు. ఈసారి టై బ్రేకర్‌లో జొకోవిచ్‌ పైచేయి సాధించాడు.

వరుసగా రెండు బ్రేక్‌ పాయింట్లు సాధించిన నొవాక్‌ 5-3తో పైచేయి సాధించాడు. తొమ్మిదో గేమ్‌లో నొవాక్‌ మ్యాచ్‌ కోసం సర్వీస్‌ చేశాడు. అయితే ఈ సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన ఫెడెక్స్‌ మ్యాచ్‌లో నిలబడ్డాడు. అనంతరం జొకోవిచ్‌కు ఫెడరర్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసే అవకాశం వచ్చింది. అదే జరిగితే నొవాక్‌ మ్యాచ్‌ నెగ్గినట్టే.

కానీ, ఈ సమయంలో ఫెడరర్‌ తనలోని అత్యుత్తమ ఆటను బయటకు తీశాడు. నొవాక్‌ మ్యాచ్‌ పాయింట్‌పై ఉన్న దశలో రెండు అద్భుతమైన ఏస్‌లు సంధించి ఆ గేమ్‌ను కాపాడుకున్నాడు. తర్వాత నొవాక్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన ఫెడరర్‌ వరుసగా మూడు గేమ్‌లు నెగ్గి 7-5తో సెట్‌ను సొంతం చేసుకున్నాడు. ఇక నిర్ణాయక ఐదో సెట్‌లో ఇద్దరూ భీకరంగా పోరాడంతో తొమ్మిదో గేమ్‌ వరకూ బ్రేక్‌ సాధ్యం కాలేదు. పదో గేమ్‌లో ఫెడెక్స్‌ చేసిన తప్పిదాలు జొకోవిచ్‌కు కలిసొచ్చాయి. ఈ గేమ్‌ను బ్రేక్‌ చేసిన నొవాక్‌ సెట్‌తోపాటు టైటిల్‌నూ నెగ్గాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+