Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వింబుల్డన్: సిలిచ్‌కు షాక్‌... మూడో రౌండ్‌లో నాదల్, జొకోవిచ్‌

Wimbledon: Nadal comes through tough Kukushkin test, Halep races away; Cilic stunned

హైదరాబాద్: లండన్‌లో జరుగుతున్న వింబుల్డన్‌లో సంచలనం నమోదైంది. గతేడాది రన్నరప్, మూడో సీడ్ మారిన్‌ సిలిచ్‌ రెండో రౌండ్‌లోనే ఇంటిదారి పట్టాడు. గురువారం పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్లో అర్జెంటీనాకు చెందిన గిడో పెల్లా 3-6, 1-6, 6-4, 7-6 (7-3), 7-5తో సిలిచ్‌కు షాకిచ్చాడు.

అర్జెంటీనాకు చెందిన అన్‌సీడెడ్‌ ఆటగాడు గ్విడో పెల్లాతో జరిగిన రెండో రౌండ్‌లో తొలి రెండు సెట్లు గెలిచిన సిలిచ్ ఆ తర్వాత తడబడ్డాడు. వర్షం కారణంగా వాయిదా పడి తిరిగి గురువారం కొనసాగిన ఈ పోరులో గ్విడో 3-6, 1-6, 6-4, 7-6 (3), 7-5 స్కోరుతో మూడో సిలిచ్‌ను షాక్‌కు గురి చేశాడు.

ఇంతకుముందు వింబుల్డన్‌లో ఒక్క మ్యాచ్‌ కూడా నెగ్గని పెల్లా ఈసారి ఏకంగా మూడోసీడ్‌ను ఓడించడం విశేషం. రెండు వారాల కిందట క్వీన్స్‌క్లబ్‌ గ్రాస్‌ కోర్టు టోర్నీ టైటిల్‌ గెలుపొందిన సిలిచ్‌.. వింబుల్డన్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగాడు. కానీ వర్షం అంతరాయం తర్వాత కొనసాగిన మ్యాచ్‌లో పూర్తిగా తేలిపోయాడు.

 మూడో రౌండ్లోకి నాదల్, జొకోవిచ్

మూడో రౌండ్లోకి నాదల్, జొకోవిచ్

మరోవైపు మాజీ ఛాంపియన్లు రఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌), నొవాక్‌ జొకోవిచ్‌ (సెర్బియా) ముందంజ వేశారు. వీరితో పాటు 15వ సీడ్‌ నిక్‌ కిరియోస్‌, మహిళల్లో టాప్‌సీడ్‌ హలెప్‌, 11వ సీడ్‌ కెర్బర్‌ సునాయాసంగా మూడో రౌండ్‌కు చేరుకున్నారు. రెండో రౌండ్లో ప్రపంచ నంబర్‌వన్‌ నాదల్‌ 6-4, 6-3, 6-4తో కుకుష్కిన్‌ (కజకిస్థాన్‌)పై నెగ్గాడు. ఈ మ్యాచ్‌లో ఐదు ఏస్‌లు కొట్టిన నాదల్‌.. ఐదు బ్రేక్‌ పాయింట్లు సాధించాడు. మూడో రౌండ్‌లో అలెక్స్‌ డి మినౌర్‌ (ఆస్ట్రేలియా)తో నాదల్ తలపడనున్నాడు.

జెబాలోస్‌పై జొకోవిచ్‌ విజయం

జెబాలోస్‌పై జొకోవిచ్‌ విజయం

ఇక, మూడు సార్లు వింబుల్డన్ విజేత జొకోవిచ్‌ 6-1, 6-2, 6-3తో అర్జెంటీనాకు చెందిన హొరాసియో జెబాలోస్‌పై విజయం సాధించాడు. ఇతర మ్యాచ్‌ల్లో జాన్‌ ఇస్నర్‌ (అమెరికా) 6-1, 6-4, 6-7 (6-7), 6-7 (3-7), 7-5తో బెమెల్‌మాన్స్‌ (బెల్జియం)పై, కిర్గియోస్‌ (ఆస్ట్రేలియా) 6-3, 6-4, 7-5తో రాబిన్‌ హాస్‌ (నెదర్లాండ్స్‌)పై విజయం సాధించారు. డెల్‌పొట్రో (అర్జెంటీనా) 6-4, 6-1, 6-2తో లోపెజ్‌ (స్పెయిన్‌)పై, నిషికోరి 2-6, 6-3, 7-6 (9-7), 7-5తో టామిచ్‌పై నెగ్గారు.

మూడో రౌండ్లో అడుగుపెట్టిన హలెప్

మూడో రౌండ్లో అడుగుపెట్టిన హలెప్

మహిళల సింగిల్స్‌లో టాప్‌ సీడ్‌ హలెప్‌ (రొమేనియా) మూడో రౌండ్లో అడుగుపెట్టింది. రెండో రౌండ్‌లో హలెప్‌ 7-5, 6-0తో జెంగ్‌ (చైనా)పై రెండో రౌండ్‌లో సునాయాసంగా నెగ్గింది. మిగతా మ్యాచ్‌ల్లో 11వ సీడ్‌ కెర్బర్‌ (జర్మనీ) 3-6, 6-2, 6-4 స్కోరుతో లియుని, బార్తీ 6-4, 7-5తో బౌచర్డ్‌ని, మెర్టెన్స్‌ 6-1, 6-3తో వికేరిని ఓడించి మూడో రౌండ్లోకి ప్రవేశించారు.

 డబుల్స్‌లో విష్ణువర్ధన్‌ జోడీ శుభారంభం

డబుల్స్‌లో విష్ణువర్ధన్‌ జోడీ శుభారంభం

పురుషుల డబుల్స్‌లో తెలుగు ఆటగాడు విష్ణువర్ధన్‌, శ్రీరామ్‌ బాలాజి జోడీ రెండో రౌండ్లో అడుగుపెట్టింది. తొలి రౌండ్లో ఈ జోడీ 7-6 (7-5), 6-4, 7-6 (7-4)తో మార్కస్‌ డానియెల్‌ (న్యూజిలాండ్‌), వెస్లీ కూలూఫ్‌ (నెదరాండ్స్‌) ద్వయంపై విజయం సాధించింది. మరోవైపు 12వ సీడ్‌ రోహన్‌ బోపన్న-రోజర్‌ వాసిలిన్‌ (ఫ్రాన్స్‌) ద్వయం 6-2, 6-2, 6-4 స్కోరుతో ఆస్ట్రేలియా జోడీ డిమినౌర్‌-మిల్‌మన్‌పై రెండో రౌండ్లో ప్రవేశించారు.

Story first published: Friday, July 6, 2018, 11:00 [IST]
Other articles published on Jul 6, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+