వింబుల్డన్‌లో పెను సంచలనం: 38 ఏళ్ల తర్వాత సెమీస్‌కు
హైదరాబాద్: వింబుల్డన్ టోర్నీలో మహిళల సింగిల్స్‌లో మంగళవారం సంచలనాలు నమోదయ్యాయి. 38 ఏళ్ల తర్వాత సెమీస్ చేసిన తొలి బ్రిటన్ అమ్మాయిగా జొహన్నా కాంటా చరిత్ర సృష్టించింది. సొంత ప్రేక్షకుల సమక్షంలో జరిగిన పోరులో రొమేనియా సంచలనం, రెండో సీడ్ సిమోన్ హాలెప్‌ను 6-7 (2/7), 7-6 (7/5), 6-4 స్కోరుతో విజయం సాధించి సెమీస్ చేరుకుంది.

38 ఏళ్ల తర్వాత సెమీస్‌కు
మరోవైపు టాప్ సీడ్ కెర్బర్ ప్రీక్వార్టర్స్‌లో ఓడగా.. రెండో సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా) కూడా నిష్క్రమించింది. మంగళవారం జరిగిన క్వార్టర్స్ ఫైనల్లో బ్రిటన్‌కు చెందిన ఆరో సీడ్ జొహన్నా కాంటా రెండో సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా)పై ఘన విజయం సాధించింది. రెండున్నర గంటలకు పైగా సాగిన ఈ మ్యాచ్‌లో హలెప్ తుది వరకు పోరాడి ఓటమి పాలైంది.

సెమీస్‌కు చేరిన ముగురుజా
మరోవైపు వింబుల్డన్‌లో స్పెయిన్ ఆశాకిరణం ముగురుజా, అమెరికాకు చెందిన వీనస్ విలియమ్స్ అలవోకగా సెమీస్ చేరుకున్నారు. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సర్వ్ అండ్ వాలీ గేమ్‌తో హడలెత్తిస్తూ రష్యా అమ్మాయి స్వెత్లానా కుజ్‌నెత్సోపై 6-3,6-4 తేడాతో నెగ్గి విజయాన్ని సాధించింది.

15 అనవసర తప్పిదాలు
గంటా 15 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో ముగురుజా పవర్ గేమ్‌తో కుజ్‌నెత్సోవాను చిత్తు చేసి వింబుల్డన్‌లో సెమీస్ చేరింది. ముగురుజా రెండు డబుల్ ఫాల్ట్స్, 15 అనవసర తప్పిదాలు చేసినా కూడా స్వెత్లానా పుంజు కోలేకపోయింది. ఒక ఏస్, డబుల్ ఫాల్ట్ చేసిన కుజ్నెత్సోవా.. మూడు బ్రేక్ పాయింట్లలో ఒక్కదాన్నీ సద్వినియోగం చేసుకోలేక మూల్యం చెల్లించుకుంది.

2009 తర్వాత వింబుల్డన్‌లో తొలిసారి సెమీస్ చేరిన వీనస్
సెంటర్ కోర్టులో 73 నిమిషాల పాటు సాగిన మరో క్వార్టర్ ఫైనల్లో 6-3, 7-5 స్కోరుతో వరుససెట్లలో ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ ఓస్టాపెంకోపై వీనస్ విలియమ్స్ విజయం సాధించింది. 2009 తర్వాత వింబుల్డన్‌లో తొలిసారి సెమీస్ చేరింది. 1994లో వింబుల్డన్‌లో సెమీస్ చేసిన మార్టినా నవ్రతిలోవా అనంతరం సెమీస్ చేరిన అత్యంత వయసు మహిళగా రికార్డు సాధించింది.

తొమ్మిదోసారి క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టిన జొకోవిచ్
కాగా, మరో క్వార్టర్స్‌లో అన్‌సీడెడ్ మాగ్డలేనా రిబరికోవా (స్లోవేకియా) 6-3, 6-3తో 24వ ప్లేయర్ కొకొ వాండవెఘె (అమెరికా)కు షాకిచ్చి సెమీస్ చేరింది. భుజం గాయంతో ఇబ్బందిపడుతున్న రెండోసీడ్ నొవాక్ జొకోవిచ్ మంగళవారం జరిగిన మ్యాచ్‌లో జొకోవిచ్ 6-2, 7-6 (7/5), 6-4తో అడ్రియాన్ మన్నారినో (ఫ్రాన్స్)పై గెలిచి తొమ్మిదోసారి క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications