Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వింబుల్డన్ సెమీ ఫైనల్: నాదల్‌‌కు షాకిచ్చిన జకోవిచ్

Wimbledon: How the Djokovic-Nadal semi-final will be won and lost

హైదరాబాద్: వింబుల్డన్‌లో ఫైనల్‌‌లోకి చాన్నాళ్ల తర్వాత చేరి తానేం తీసిపోనంటూ.. నాదల్‌ను షాక్‌కు గురి చేశాడు. సుదీర్ఘంగా, రెండు రోజుల పాటు (శుక్రవారం ఆట సగంలో రద్దయింది) సాగిన పురుషుల సింగిల్స్‌ సెమీస్‌లో నొవాక్‌ 6-4, 3-6, 7-6 (9), 3-6, 10-8తో మాజీ ఛాంపియన్‌, ప్రపంచ నంబర్‌వన్‌ రఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌)ను ఓడించాడు. హోరాహోరీగా సాగిన ఈ మారథాన్‌ సమరంలో ఎక్కువశాతం జకోదే పైచేయి అయింది.

పదునైన సర్వీసులు, రిటర్న్‌లతో నొవాక్‌:

పదునైన సర్వీసులు, రిటర్న్‌లతో నొవాక్‌:

పదునైన సర్వీసులు, రిటర్న్‌లతో ఆకట్టుకున్న నొవాక్‌.. తొలి సెట్‌ ఏడో గేమ్‌లో నాదల్‌ సర్వీస్‌ బ్రేక్‌ చేసి 6-4తో సెట్‌ గెలిచాడు. రెండో సెట్లో పుంజుకున్న నాదల్‌.. నాలుగో గేమ్‌లో జకో సర్వీస్‌ బ్రేక్‌ సాధించి 6-3తో సెట్‌ నెగ్గాడు. హోరాహోరీగా జరిగిన మూడో సెట్లో ఇద్దరూ సర్వీసులు నిలబెట్టుకుంటూపోవడంతో సెట్‌ టైబ్రేకర్‌కు వెళ్లింది. టైబ్రేకర్‌లో 7-6 (11-9)తో గెలిచిన జకోవిచ్‌.. మ్యాచ్‌లో ఆధిక్యంలో నిలిచాడు. ఈ సమయంలోనే మ్యాచ్‌ను వాయిదా వేశారు. శనివారం మళ్లీ మ్యాచ్‌ మొదలయ్యాక జకోపై నాదల్‌ పైచేయి సాధించాడు.

రఫా పట్టుదల వదల్లేదు

రఫా పట్టుదల వదల్లేదు

ఇలా... మాజీ చాంపియన్స్‌ మధ్య సుదీర్ఘంగా సాగిన పురుషుల సింగిల్స్‌ రెండో సెమీఫైనల్లో నొవాక్‌ జొకోవిచ్‌ (సెర్బియా) పైచేయి సాధించాడు. ప్రపంచ నంబర్‌వన్‌ రాఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌)తో శనివారం జరిగిన సెమీఫైనల్లో 12వ సీడ్‌ జొకోవిచ్‌ 6-4, 3-6, 7-6 (11/9), 3-6, 10-8తో గెలుపొందాడు. నాలుగో సెట్‌ పదకొండో గేమ్‌లో 40-30తో నిలిచిన జకో మ్యాచ్‌ గెలిచేలా కనిపించాడు. కానీ రఫా పట్టుదల వదల్లేదు. ఏస్‌తో స్కోరు సమం చేసిన అతను.. ఆ తర్వాత మరో రెండు విన్నర్లతో సర్వీస్‌ కాపాడుకున్నాడు.

నాదల్‌ సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్‌

నాదల్‌ సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్‌

అక్కడ నుంచి ఎవరికి వాళ్లు సర్వీసులు నిలబెట్టుకుంటూ వెళ్లడంతో స్కోరు సమంగా సాగింది. ఐతే 18వ గేమ్‌లో బ్యాక్‌హ్యాండ్‌ విన్నర్‌తో నాదల్‌ సర్వీస్‌ బ్రేక్‌ చేసిన జకో.. 10-8 సెట్‌తో పాటు మ్యాచ్‌ గెలిచాడు. 5 గంటల 15 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్‌ 23 ఏస్‌లు సంధించి, నాదల్‌ సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్‌ చేశాడు. ఆదివారం జరిగే ఫైనల్లో ఎనిమిదో సీడ్‌ కెవిన్‌ అండర్సన్‌ (దక్షిణాఫ్రికా)తో జొకోవిచ్‌ తలపడతాడు.

2011, 2014, 2015లలో జొకోవిచ్‌ వింబుల్డన్‌ చాంపియన్‌గా

2011, 2014, 2015లలో జొకోవిచ్‌ వింబుల్డన్‌ చాంపియన్‌గా

2011, 2014, 2015లలో జొకోవిచ్‌ వింబుల్డన్‌ చాంపియన్‌గా నిలువగా... అండర్సన్‌ తొలిసారి ఈ టోర్నీలో ఫైనల్‌కు చేరాడు. శుక్రవారమే నాదల్, జొకోవిచ్‌ సెమీఫైనల్‌ ముగియాల్సింది. అయితే అండర్సన్, జాన్‌ ఇస్నెర్‌ (అమెరికా) మధ్య తొలి సెమీఫైనల్‌ 6 గంటల 36 నిమిషాలపాటు సాగడంతో నాదల్, జొకోవిచ్‌ రెండో సెమీఫైనల్‌ ఆలస్యంగా ప్రారంభమైంది. మరోవైపు రాత్రి 11 తర్వాత ఆటను నిలిపివేయాలని వింబుల్డన్‌ టోర్నీ నిబంధనలు చెబుతున్నాయి. అప్పటికి జొకోవిచ్‌ 6-4, 3-6, 7-6 (11/9)తో ఆధిక్యంలో ఉండటం... ఫలితం రాకపోవడంతో మ్యాచ్‌ను శనివారం కొనసాగించారు.

Story first published: Sunday, July 15, 2018, 11:46 [IST]
Other articles published on Jul 15, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+