Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తుది అంకానికి వింబుల్డన్: చరిత్రకు అడుగు దూరంలో వీనస్

హైదరాబాద్: వింబుల్డన్‌లో మహిళల సింగిల్స్ పోరు తుది అంకానికి చేరింది. అమెరికా స్టార్‌ వీనస్‌ విలియమ్స్, స్పెయిన్‌ క్రీడాకారిణి ముగురుజా వింబుల్డన్ ఫైనల్స్‌లోకి అడుగుపెట్టారు. ఇప్పటికే ఐదు సార్లు వింబుల్డన్‌ టైటిల్‌ గెలిచిన వీనస్‌ విలియమ్స్ తన ఆరో టైటిల్‌ కోసం పోటీ పడుతుండగా, స్పెయిన్‌‌కు చెందిన ముగురుజా వింబుల్డన్‌ వేదికపై కొత్త చాంపియన్‌గా అవతరించేందుకు సిద్ధమైంది.

ముగురుజా ఇదే వింబుల్డన్ వేదికపై 2015లో ఫైనల్లో ఓటమిపాలైంది. కానీ ఈసారి టైటిల్‌ కోసం ఆమె వెటరన్‌ టెన్నిస్ స్టార్ వీనస్‌ విలియమ్స్‌తో ఫైనల్లో తలపడనుంది. వీనస్, ముగురుజాల మధ్య శనివారం ఫైనల్‌ మ్యాచ్‌ జరుగనుంది. దీంతో ముగురుజా రెండోసారి వింబుల్డన్‌ ఫైనల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.

రిబరికోవాపై ముగురుజా విజయం

రిబరికోవాపై ముగురుజా విజయం

గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్లో 14వ సీడ్‌ ముగురుజా వరుస సెట్లలో 6-1, 6-1తో మగ్దలినా రిబరికోవా (స్లోవేకియా)పై విజయం సాధించించింది. తొలిసారి గ్రాండ్‌స్లామ్‌ సెమీఫైనల్‌ ఆడిన ప్రపంచ 87వ ర్యాంకు క్రీడాకారిణి రిబరికోవా.. ముగురుజాకు ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. తొలి సెట్‌లో 8 విన్నర్స్‌ను కొట్టిన ముగురుజా రెండో సెట్‌లో తన జోరు పెంచింది. దీంతో ఏకంగా 14 విన్నర్స్‌ను సాధించింది. ఇద్దరు చెరో 3 ఏస్‌లు సంధించారు. ముగురుజా 11 అనవసర తప్పిదాలు చేసింది.

11 అనవసర తప్పిదాలు చేసిన రిబరికోవా

11 అనవసర తప్పిదాలు చేసిన రిబరికోవా

ఐదు బ్రేక్‌ పాయింట్లు సాధించింది. రిబరికోవా కూడా 11 అనవసర తప్పిదాలు చేసింది. ఈ విజయంతో ఆమెకు డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో టాప్‌-10లో చోటు దక్కడం ఖాయమైంది. టైటిల్‌ గెలిస్తే ముగురు టాప్‌-5లోకి దూసుకెళ్తుంది. అరంటా శాంచెజ్‌ వికారియో (1990) తర్వాత రెండుసార్లు వింబుల్డన్‌ ఫైనల్‌కు చేరిన తొలి స్పెయిన్‌ అమ్మాయిగా ముగురుజా ఘనత సాధించింది. ముగురుజా 2016లో ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఛాంపియన్‌గా నిలిచింది.

7 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు సాధించిన వీనస్ విలియమ్స్

7 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు సాధించిన వీనస్ విలియమ్స్

తన సుదీర్ఘ కెరీర్‌లో 7 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు సాధించిన వీనస్ విలియమ్స్ ఇటీవల కాలంలో పెద్దగా విజయాలేమీ లేకపోవడం, వయసు పెరుగుతుండడంతో పదో సీడ్‌ వీనస్‌ విలియమ్స్‌ను ఎవరూ గట్టి పోటీదారుగా పరిగణించలేదు. దీంతో ఈసారి ఎలాంటి అంచనాలు లేకుండానే బరిలోకి దిగింది. కానీ తనకు వయసు అడ్డంకి కాదని, చేవ తగ్గలేదని నిరూపిస్తూ ఆమె ఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన రెండో సెమీఫైనల్లో వీనస్‌ 6-4, 6-2తో బ్రిటన్‌ క్రీడాకారిణి జొహానా కొంటాపై విజయంపై సాధించింది.

ఎనిమిదో గేమ్‌ తర్వాత 4-4తో సమంగా

అనుభవజ్ఞురాలైన వీనస్‌కు ఏస్‌లతో బదులిచ్చింది. ఏస్‌ల్లో వీనస్‌ పూర్తిగా వెనుకబడగా... జొహానా మాత్రం 7 ఏస్‌లను సంధించింది. విన్నర్స్‌లోనూ బ్రిటన్‌ ప్లేయర్‌దే పైచేయి అయింది. ఒకానొక సమయంలో ఇద్దరూ సర్వీసులు నిలబెట్టుకోవడంతో తొలి సెట్లో ఎనిమిదో గేమ్‌ తర్వాత 4-4తో సమంగా నిలిచారు. తొమ్మిదో గేమ్‌లోనూ సర్వీసు నిలుపుకుని వీనస్‌ 5-4తో ఆధిక్యంలోకి వెళ్లింది. కీలకమైన పదో గేమ్‌లో కొంటా సర్వీసులో తడబడింది. ఇక రెండో సెట్లో ఆమె మరింత దూకుడు ప్రదర్శించింది.

కొంటాపై తిరుగులేని ఆధిపత్యం

కొంటాపై తిరుగులేని ఆధిపత్యం

తనకన్నా 13 ఏళ్లు చిన్నదైన కొంటాపై తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. నాలుగు, ఎనిమిదో గేమ్‌ల్లో బ్రేక్‌తో అలవోకగా సెట్‌ను గెలిచి ఫైనల్లో అడుగుపెట్టింది. అయితే పదే పదే అనవసర తప్పిదాలతో పాటు డబుల్‌ ఫాల్ట్‌లతో జొహానా మూల్యం చెల్లించుకుంది. 13 అనవసర తప్పిదాలు, 4 డబుల్‌ ఫాల్ట్‌లు చేసింది. మ్యాచ్‌ మొత్తం మీద ఒకే ఒక్క ఏస్‌ సంధించిన వీనస్‌ 4 బ్రేక్‌ పాయింట్లతో పోరులో నిలిచింది. రెండో సెట్‌లో జోరు పెంచిన వీనస్‌ 11 విన్నర్స్‌ సాధించగా... ప్రత్యర్థి జొహానా 6 విన్నర్స్‌ కొట్టింది.

అతి పెద్ద వయసు క్రీడాకారిణిగా చరిత్ర

అతి పెద్ద వయసు క్రీడాకారిణిగా చరిత్ర

గంటా 13 నిమిషాల్లో జోహానా కొంటాపై విజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించింది. వీనస్‌ చివరిసారి 2009లో వింబుల్డన్‌ ఫైనల్‌ చేరుకుంది. ఆ తర్వాత ఆమెకిది రెండో గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌ మాత్రమే. ఏడో సీడ్‌ కొంటా ఈ మ్యాచ్‌లో గెలిచి ఉంటే గత 40 ఏళ్లలో వింబుల్డన్‌ ఫైనల్‌ చేరిన తొలి బ్రిటన్‌ మహిళగా ఘనత సాధించేది. వీనస్‌ విలియమ్స్‌ గెలిస్తే ఓపెన్‌ శకం (1968 నుంచి)లో మహిళల గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ సాధించిన అతి పెద్ద వయసు క్రీడాకారిణిగా చరిత్ర సృష్టిస్తుంది.

Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+