Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వింబుల్డన్‌లో వింత ప్రవర్తన: అంఫైర్‌పై 'చిల్లర' విసిరాడు, జరిమానా

హైదరాబాద్: సాధారణంగా ఎవరికైనా కోపం వస్తే గట్టిగా అరుస్తారు లేదా తిడతారు. కానీ గురువారం వింబుల్డన్‌లో రష్యా ఆటగాడు డానిల్‌ మెద్వెదేవ్‌ మాత్రం చాలా వెరైటీగా తన ఆగ్రహం వ్యక్తం చేశాడు. వింబుల్డన్ తొలి రౌండ్‌లో వావ్రింకాపై సంచలన విజయాన్ని నమోదు చేసిన డానిల్‌ మెద్వెదేవ్‌ అందరి దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే.

రెండో రౌండ్ ఓటమిని తట్టుకోలేకపోయిన మెద్వెదేవ్‌

రెండో రౌండ్ ఓటమిని తట్టుకోలేకపోయిన మెద్వెదేవ్‌

అయితే గురువారం జరిగిన రెండో రౌండ్‌లో ఓటమిని తట్టుకోలేకపోయాడు. టోర్నీలో భాగంగా రూబెన్‌ బెమెల్‌మన్స్‌ (బ్రెజిల్‌)తో జరిగిన మ్యాచ్‌లో మెద్వెదేవ్‌ 4-6, 2-6, 6-3, 6-2, 3-6 తేడాతో ఓటమి పాలయ్యాడు. మ్యాచ్‌ ముగిసిన తర్వాత తన చెయిర్‌ వద్దకు వెళ్లిన అతను వ్యాలెట్‌ను బయటకు తీశాడు.

అంఫైర్ కాళ్ల వద్ద చిల్లర నాణేలు

అంఫైర్ కాళ్ల వద్ద చిల్లర నాణేలు

అందులోంచి ఒక్కొక్కటిగా చిల్లర నాణేలు తీసి అక్కడే ఉన్న అంపైర్‌ మారియానా ఆల్వ్‌ కాళ్ల వద్దకు వరుసగా విసిరేయడం అక్కడున్న అందరినీ ఆశ్చర్యం కలిగించింది. అయితే ఇలా ఎందుకు చేశాడో మ్యాచ్ అనంతరం విలేకరుల సమావేశంలో పేర్కొన్నాడు.

ఎందుకు చేశాడో మీడియా సమావేశంలో

ఎందుకు చేశాడో మీడియా సమావేశంలో

ఐదో సెట్‌లో ఒక పాయింట్‌ విషయంలో అంపైర్‌ తనకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నందుకు అతను ఇలా చేశానని తెలిపాడు. ‘ఓటమితో నేను తీవ్రంగా నిరాశ చెందాను. చిల్లర విసిరేయడానికి కారణం ఇదీ అని కూడా నేను చెప్పలేను. అలా ఎందుకు చేశానో నాకే తెలీదు. ఆ సమయంలో అసహనంతో అలా జరిగిపోయిందంతే. దీనికి క్షమాపణ కోరుతున్నాను' అని చెప్పాడు.

జరిమానా విధించిన టోర్నీ నిర్వాహకులు

జరిమానా విధించిన టోర్నీ నిర్వాహకులు

అయితే ఈ సంఘటనను వింబుల్డన్‌ నిర్వాహకులు మాత్రం సీరియస్‌గా తీసుకున్నారు. మ్యాచ్ జరిగిన సమయంలో అతని ప్రవర్తనను సీరియస్‌గా తీసుకున్న టోర్నీ నిర్వహకులు అతడికి మూడు వేర్వేరు రకాల జరిమానాలు విధించారు. మూడూ కలిపి మెద్వెదేవ్‌పై మొత్తం 14,500 డాలర్లు (దాదాపు రూ. 9.38 లక్షలు) జరిమానా పడింది.

Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+