డబ్బు కోసమే: వింబుల్డన్‌లో ఫెదరర్ వివాదాస్పద వ్యాఖ్యలు
హైదరాబాద్: ఆటగాళ్ల ప్రవర్తనతో ప్రతిష్టాత్మక వింబుల్డన్ టోర్నీకి చెడ్డ పేరు వస్తుందా? అంటే అవుననే అంటున్నారు. 'వారు డబ్బు కోసమే ఆడుతున్నారు' తొలి రౌండ్‌లో గెలిచిన తర్వాత ఏడు సార్లు వింబుల్డన్ చాంపియన్‌గా నిలిచిన రోజర్ ఫెదరర్ మీడియాతో అన్న మాటలివి.
రోజర్ ఫెదరర్ ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. వింబుల్డన్ రూల్స్ ప్రకారం తొలి రౌండ్‌లోనే (సింగిల్స్) ఓటమిపాలైనా ప్రతీ ఆటగాడికి 35 వేల పౌండ్లు (దాదాపు రూ. 29.31 లక్షలు) కనీస ప్రైజ్ మనీ లభిస్తుంది. ఈ మొత్తం చిన్న స్థాయి టోర్నీలు గెలుచుకున్న దానితో పోలిస్తే ఎక్కువే.

గాయం నుంచి తప్పుకున్నా పెద్ద మొత్తం
ఆటగాడు మ్యాచ్ మధ్యలో గాయంతో తప్పుకున్నా టోర్నీ నిర్వహకులు ఈ మొత్తాన్ని అతడికి అందజేస్తారు. సోమవారం నుంచి ప్రారంభమైన వింబుల్డన్ టోర్నీ తొలి రౌండ్‌లో ఏకంగా ఎనిమిది మంది ఆటగాళ్లు (పురుషులు, మహిళల విభాగాల్లో కలిపి) మ్యాచ్ మధ్యలో తప్పుకున్నారు.

అసహనం వ్యక్తం చేసిన రోజర్ ఫెదరర్
దీనిపై రోజర్ ఫెదరర్ అసహనం వ్యక్తం చేశాడు. వారు డబ్బు కోసమే ఆడుతున్నారంటూ మండిపడ్డాడు. రెండో రోజైన మంగళవారం ఫెదరర్ ప్రత్యర్థి డల్గొపలోవ్ (ఉక్రెయిన్) ఇలాగే నిష్క్రమించగా, జొకోవిచ్‌తో తలపడిన మార్టిన్ క్లిజాన్ (స్లొవేకియా) కూడా గాయంతో ఆట మధ్యలోనే తప్పుకున్న సంగతి తెలిసిందే.

వేరేవాళ్లకు అవకాశం ఇస్తే మంచిది
‘నా దృష్టిలో వారికి దక్కుతున్న మొత్తం చాలా ఎక్కువే. గాయంతో కూడా ఇక్కడికి వచ్చి వారు ఏదో అద్భుతం జరగవచ్చని ఆశిస్తారు. పూర్తి ఫిట్‌గా లేని ఆటగాళ్లు ముందే తప్పుకొని వేరేవాళ్లకు అవకాశం ఇస్తే మంచిది. ఇలాంటి ఆటగాళ్లు డబ్బు కోసమే బరిలోకి దిగుతున్నారని చెప్పగలను' అని మ్యాచ్ అనంతరం ఫెదరర్ పేర్కొన్నాడు.

నష్టపోయిన ప్రేక్షకుల కోసం
అంతేకాదు సెంటర్ కోర్టులో పెద్ద ఆటగాళ్ల మ్యాచ్ చూసేందుకు భారీ మొత్తంలో టికెట్లు కొని ప్రేక్షకులు వస్తారని, ఇది వారిని తీవ్రంగా నిరాశపరుస్తుందని ఫెదరర్ తెలిపాడు. నష్టపోయిన ప్రేక్షకుల కోసం తానూ, జొకోవిచ్ కలిసి మ్యాచ్ ఆడాల్సిందేమోనని ఫెదరర్ సరదాగా వ్యాఖ్యానించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications