వింబుల్డన్: ఫెదరర్ అల్‌టైమ్ రికార్డు, 85వ విజయం
హైదరాబాద్: వింబుల్డన్ టోర్నీలో ఏడు సార్లు ఛాంపియన్, మూడో సీడ్ రోజర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్) వరుసగా 15వ ఈ ఏడాది కూడా శుభారంభం చేశాడు. రెండో రోజైన మంగళవారం జరిగిన తొలి రౌండ్‌లో ఫెదరర్ 6-3, 3-0తో ఆధిక్యంలో ఉన్న దశలో అతని ప్రత్యర్థి అలెగ్జాండర్ డల్గొపలోవ్ (ఉక్రెయిన్) చీలమండ గాయం కారణంగా వైదొలిగాడు.
దీంతో సెంటర్ కోర్టులో స్విస్ దిగ్గజం ఫెడరర్ మ్యాచ్ చూద్దామని ఆశించిన అభిమానులకు నిరాశే మిగిలింది. తొలి రౌండ్‌లో మొదటి సెట్‌ను 6-3 స్కోరుతో సునాయాసంగా కైవసం చేసుకున్న ఫెడరర్ రెండో సెట్‌లో 3-0తో ఆధిక్యంలో ఉండగా తన ప్రత్యర్థి అలెగ్జాండర్ డల్గొపలోవ్ గాయం కారణంగా నిష్క్రమించాడు. దీంతో ఫెదరర్ ఈ టోర్నీ చరిత్రలో 85వ విజయాన్ని నమోదు చేశాడు.
ఈ క్రమంలో 84 విజయాలతో జిమ్మీ కానర్స్ పేరిట ఉన్న రికార్డును బద్దలుగొట్టిన ఫెడరర్ వింబుల్డన్‌లో మరో అరుదైన ఘనత సాధించాడు. ఓపెన్ శకంలో (1968 తర్వాత) వింబుల్డన్ టోర్నీలో అత్యధికంగా 85 విజయాలు సాధించిన ప్లేయర్‌గా... టెన్నిస్ చరిత్రలో 10 వేల 'ఏస్'లు పూర్తి చేసుకున్న మూడో ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు.
వింబుల్డన్‌లో 85వ విజయాన్ని నమోదు చేసిన ఫెదరర్
ప్రస్తుతం ఫెదరర్ ఖాతాలో మొత్తం 10,004 ఏస్‌లు ఉన్నాయి. ఈ జాబితాలో ఇవో కార్లోవిచ్ (క్రొయేషియా:12,062 ఏస్‌లు), గొరాన్ ఇవానిసెవిచ్ (క్రొయేషియా:10, 131 ఏస్‌లు) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. అంతకముందు సెంటర్ కోర్టులో మాజీ చాంపియన్, రెండో సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) కూడా రెండో రౌండ్‌కు చేరుకున్నాడు.
రెండో రౌండ్‌లోకి నొవాక్ జకోవిచ్
40 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో జొకోవిచ్ 6-3, 2-0తో ఆధిక్యంలో ఉన్న దశలో అతని ప్రత్యర్థి మార్టిన్ క్లిజాన్ (స్లొవేకియా) గాయం కారణంగా తప్పుకున్నాడు. ఇక మంగళవారం ఇతర మ్యాచ్‌ల్లో పదో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (రష్యా) 6-4, 7-6 (7-3), 6-3తో డాన్‌స్కాయ్ (రష్యా)పై, డేవిడ్ ఫెర్రర్ (స్పెయిన్) 6-3, 6-4, 5-7, 6-2తో రిచర్డ్ గాస్క్వెట్ (ఫ్రాన్స్)పై గెలిచారు.

మహిళల సింగిల్స్‌లో కెర్బర్ శుభారంభం
మోన్‌ఫిల్స్ (ఫ్రాన్స్), బగ్దాటిస్ (సైప్రస్), మిఖైల్ యోజ్ని (రష్యా), కుకిష్కిన్ (కజక్‌స్థాన్) కూడా రెండో రౌండ్లో అడుగుపెట్టారు. ఇక మహిళల సింగిల్స్‌లో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ కెర్బర్ (జర్మనీ) శుభారంభం చేసింది. తొలి రౌండ్లో ఆమె 6-4, 6-4తో క్వాలిఫయర్ ఫాల్కాని (అమెరికా)పై విజయం సాధించింది.

రెండో రౌండ్‌లోకి అడుగుపెట్టిన
అలాగే రద్వాన్‌స్కా (పోలెండ్) 7-6, 6-0 స్కోరుతో జంకోవిచ్ (సెర్బియా)ను చిత్తుచేసి రెండో రౌండ్‌లోకి అడుగుపెట్టింది. మరో మొదటి రౌండ్ పోరులో 13వ సీడ్ జెలెనా వోస్తపెంకొ (లాత్వియా) 6-0, 1-6, 6-3 స్కోరుతో సస్నోవిచ్ (బెలారస్)పై ఒకింత కష్టంతో గెలుపొందింది. ఇతర తొలి రౌండ్‌లలో 14వ సీడ్ గాబ్రిన్ ముగురుజ (రష్యా) 6-2, 6-4 స్కోరుతో అలెగ్జాండ్రొవా (రష్యా)పై, 24వ సీడ్ కొకొ వాండవెఘె (ఫ్రాన్స్) 7-5, 6-2 స్కోరుతో మార్టిన్ బార్తెల్ (జర్మనీ)పై, ఫ్లిప్‌కెన్స్ (జర్మనీ) 6-4, 6-3 స్కోరుతో డోయి (జపాన్)పై విజయం సాధించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications